Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలవరం భోజనాల ఖర్చుల కింద రూ. కోట్లు విడుదల

Polavaram: ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

2018- 2019 మధ్య కాలానికి బకాయి ఉన్న నిధులను చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఈ నిధులు మొత్తం 23.11 కోట్ల రూపాయలు. ఈ మేరకు జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయి ప్రసాద్ జీవో నంబర్ 358ను విడుదల చేశారు.

Andhra Govt has released Rs 23 11 Cr for Polavaram project tour during Dec 2018 - March 2019

2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే గేట్లను అమర్చారు అధికారులు. స్పిల్‌వే నిర్మాణం కూడా అప్పుడే పూర్తయింది. పండగ వాతావరణంలో వాటి నిర్మాణం జరిగింది అప్పట్లో.

2018లో అప్పటి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు తొలి రేడియ‌ల్ గేట్‌ అమర్చివేత పనులను పూజలు చేసి ప్రారంభించారు. స్పిల్‌వేలో 41వ గేటు ఏర్పాటుకు అప్పట్లో ఆయన పూజలు చేశారు. ఆ త‌రువాతే గేటు ఏర్పాటు ప్ర‌క్రియ‌ను అధికారులు మొద‌లు పెట్టారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు. వెడల్పు 15.9 అడుగులు.

భారీఎత్తున నిర్మిత‌మౌతోన్న పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలంతా సంద‌ర్శించాల‌నే ఉద్దేశంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టును చూడ‌టానికి ఆసక్తి చూపే వారి కోసం ఆర్టీసీ బస్సులను నడిపించింది. ప్రాజెక్టు వ‌ద్ద భోజన సదుపాయం కల్పించింది.

Andhra Govt has released Rs 23 11 Cr for Polavaram project tour during Dec 2018 - March 2019

ప్రత్యేకించి రైతులకు అవగాహన ఏర్పడటానికి, విద్యార్థులకు ఓ స్టడీ టూర్‌గా దీన్ని చేపట్టింది. సంద‌ర్శ‌కుల‌ను ప్రాజెక్టు త‌ర‌లించే బాధ్య‌త‌ను స్థానిక పార్టీ నాయ‌కుల‌కు అప్ప‌గించింది. మండ‌లాన్ని యూనిట్ గా తీసుకుని ప్ర‌జ‌ల‌ను ప్రాజెక్టు వ‌ద్ద‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది.

ప్ర‌తిరోజూ అన్ని జిల్లాల నుంచి దాదాపు 100 బస్సుల్లో జనం ప్రాజెక్టు సందర్శించినట్లు ప్రభుత్వం ప్రకటించింది అప్పట్లో. సెల‌వు రోజులు, వారాంత‌పు రోజుల్లో అంచ‌నాకు మించి సంద‌ర్శ‌కులు ప్రాజెక్టును సంద‌ర్శించినట్లు తెలిపింది. ప్రాజెక్టు సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి వేలాదిమంది దీన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంది.

అప్పటి పోలవరం సందర్శన, భోజన ఖర్చు మొత్తం 23.11 కోట్ల రూపాయలను ఇప్పుడు విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో ఆర్టీసీకి రూ.9.16 కోట్లు, భోజన ఖర్చుల కింద రూ. 13.89 కోట్లు, బ్రోచర్లను ప్రచురించినందుకు రూ. 4.45 కోట్లు, ఇతరత్రా ఖర్చులు, పన్నుల కోసం 53 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి తప్పు పట్టారు. ఒక్కొక్కరి మీద భోజనం కోసం 750 నుంచి 1,000 రూపాయలను ఖర్చు పెట్టినట్టవుతుందని, నాలుగు నెలల కాలంలోనే మూడు లక్షల మంది వరకు పోలవరాన్ని సందర్శించినట్టవుతుందని, ఇది అసాధ్యమని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+