కరోనా పరీక్షల్లో దేశంలో నాలుగోస్ధానంలో ఏపీ- తెలంగాణ ఎక్కడుందో తెలుసా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ పాటించడమే కాకుండా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ ను అమలు చేయడంతో పాటు అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ ఏపీ నాలుగో స్ధానం దక్కించుకోవడం విశేషం.

కరోనా పరీక్షల్లో ఏపీకి నాలుగో ర్యాంకు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేగంగా పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఏర్పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాలు ఎవరికి వారు విదేశీ కిట్లతో పాటు స్వదేశంలో తయారైన మేకిన్ ఇండియా కిట్ల సాయంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో వస్తున్న ఫలితాల కచ్చితత్వం ఎంతో తేలకపోయినా స్ధూలంగా చూస్తే పరీక్షలు విజయవంతమవుతున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీంతో వివిధ రాష్ట్రాల్లో కరోనా నిర్దారణ పరీక్షలు ఎంత వేగంగా జరుగుతున్నాయనే అంశంపై కేంద్రం ఓ నివేదిక తెప్పించుకుంది. దీని ప్రకారం ఏపీ 10 లక్షల మందిలో 331 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా నాలుగో స్ధానంలో నిలిచింది.

andhra pradesh become fourth position in covid 19 tests in the country

కరోనా పరీక్షల టాప్ 3 స్ధానాల్లో వారే...

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారికి అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం కష్టమైపోతోంది. ఈ లెక్కన చూసినప్పుడు ప్రతీ పది లక్షల మంది చొప్పున లెక్కించినప్పుడు అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలుగా రాజస్ధాన్, కేరళ, మహారాష్ట్ర నిలిచాయి. వీరిలో రాజస్ధాన్ 549 పరీక్షలతో అగ్రస్ధానంలో ఉండగా. 485 పరీక్షలతో కేరళ, 446 పరీక్షలతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం
టాప్ 19 స్ధానాల్లో కూడా లేకపోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+