వీళ్లు శ్రీవారికి సేవ చేస్తారా ?, టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై పురందేశ్వరి ఫైర్ !
తిరుపతి/విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన విషయం తెలిసిందే. గత రెండు పర్యాయాలు అంటే సుమారు నాలుగు సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా కొనసాగిన వైవీ. సుబ్బారెడ్డితో పాటు ఆయన హయాంలోని పాలకమండలి పూర్తిగా రద్దు అయ్యింది. టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తరువాత టీటీడీకి కొత్త పాలకమండలి సభ్యులను నియమించారు.
శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుల పేర్లు విడుదల చేసింది. 24 మంది టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన వారు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారు.

గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పని చేసిన కొందరికి మాత్రం మరోసారి అవకాశం చిక్కింది. టీటీడీ బోర్డు సభ్యులుగా కొందరు ఎమ్మెల్యేలకు, ఓ ఎంపీ భార్యకు అవకాశం చిక్కింది. అయితే టీటీటీ బోర్డు సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తిరుమల పవిత్రను దెబ్బ తీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
టీటీడీ పాలకమండలి నియామకాలపై ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకుని తరువాత అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారని, లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు శ్రీవారి సేవ చేస్తారా అంటూ పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎంసీఐ స్కామ్ కేసులో అరెస్టు అయ్యి దోషిగా తేలిన డాక్టర్ కేతన్ దేశాయ్ తరువాత ఆయన పదవిని కోల్పోయారని, అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారని, వైసీపీకి టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రం అయ్యిందని, దీనీనీ బీజేపీ తీవ్రస్థాయిలో ఖండిస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల నియమాకంపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications