మార్చి 8న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, వైసీపీ ఎమ్మెల్యేలను పిలిచా: స్పీకర్ కోడెల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మార్చి 8వ తేదీన ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటలకు మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మాట్లాడారు. మార్చి 5న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

బుధవారం భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మండలి చైర్మన్ ఫరూక్ సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అలాగే సమావేశాలకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు వస్తారని భావిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications