ఎన్నాళ్టకో.. నెలకు రూ.15వేలు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేవాదాయశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.50వేలకు పైబడిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రస్తుత ఇస్తున్న వేతనాన్ని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ఆదేశాలు జారీచేశారు. వీరితోపాటు వేద విద్యనభ్యసించి ఉద్యోగాలు రాకుండా ఉన్నవారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు అందివ్వాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1110 ఆలయాలకు పాలక మండళ్లను నిర్ణయించాల్సి ఉంది. ఇకనుంచి పాలక మండలిలో ఇద్దరు సభ్యులను పెంచబోతున్నారు. ప్రతి పాలక వర్గంలో ఓ నాయీబ్రాహ్మణుడితోపాటు ఓ బ్రాహ్మణ సభ్యుడికి కూడా అవకాశం కల్పించనున్నారు. తొలివిడతగా రాష్ట్రంలోని 61 ప్రధాన ఆలయాల్లో అన్ని సేవలను ఆన్ లైన్ పరిధిలోకి తీసుకువస్తారు. అక్కడ నిర్వహించే విధానాన్ని బట్టి ఇతర ఆలయాలకు వర్తింపచేస్తారు. అవసరమైతే చట్టసవరణ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

andhra pradesh chief minister nara chandrababu review on endowments department

రాష్ట్రవ్యాప్తంగా రూ.50వేల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకింద ప్రస్తుతం రూ.5వేలు అందిస్తున్నారు. ఇకనుంచి దాన్ని రూ.10వేలకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కొలువైన స్వామివార్లు, అమ్మవార్తకు భక్తులు దాదాపు 44 కేజీల వెండిని దానంగా ఇచ్చారు. వీటిని స్వామివారు, అమ్మవారి డాలర్లు విక్రయించడంపై ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు.

సింహాచలం పంచగ్రామాల భూ సమస్య శ్వాశ్వత పరిష్కారానికి అధికారులు అధ్యయనం నిర్వహించి దాన్ని పరిష్కరించాలని ఆదేవించారు. అన్ని ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25వేలు ఉండాలే చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మతమార్పిడులు లేకుండా చూడాలని, అలా జరిగితే వెంటనే అడ్డుకోవాలని చంద్రబాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+