చంద్రబాబును జైల్లో పెట్టిన సీఐడీ బాస్ అమెరికా జంప్, ఫ్యాంట్ తడిచిపోతా ఉందిరా బాబు
ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఏళ్ల క్రితం అంటే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న అధికారులకు ఉన్నత పదవులు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మార్క్ తో అధికారులు సచివాలయంలో రాజకీయాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నాయకులు జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు ఎదురులేకుండా కొందరు అధికారుల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ చెప్పిందే వేదం, వైసీపీ చెప్పిందే చట్టం అనే రీతిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు వ్యవహరించారని అప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంతకాలం వన్ సైడ్ గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

త్వరలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్బంలో ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐపీఎస్ అధికారికి తడిచిపోవడంతో నెల రోజుల పాటు సెలవు పెట్టేశారు. ఆ ఐపీఎస్ అధికారి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ బాస్ సంజయ్. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ డీజీ హోదాలో పని చేస్తున్న సంజయ్ మొదటి నుంచి వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టడమే కాకుండా వైసీపీ నాయకుల ఆదేశాలతో టీడీపీకి చెందిన అనేక మంది నాయకు మీద తప్పుడు కేసులు పెట్టారని సీఐడీ బాస్ సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీకి చెందిన కొందరు నాయకులు చెప్పినట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ నడుచుకున్నారని ఐపీఎస్ అధికారి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టడంలో కీలకంగా వ్యవహరించిన సీఐడీ బాస్ సంజయ్ వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవు పెట్టి ఆయన వ్యక్తిగత కారణాలతో అమెరికా వెలుతున్నారు. నెల రోజులు సెలవు కావాలని సంజయ్ ధరఖాస్తు చేసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన రోజే ఆయన సెలవును ఆమోదించడం హాట్ టాపిక్ అయ్యింది.

సెలవు పెట్టకుండా ఇక్కడే ఉంటే సీఎం చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్లాలని, ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపించిన తాను ఏం సమాధానం చెప్పాలని ఆయన వాపోతున్నారని తెలిసింది. నెల రోజులు సెలవు పెట్టి తరువాత వస్తే అందరూ అంతలోపు చల్లబడుతారని, తరువాత సర్దుకుపోవచ్చని సీఐడీ బాస్ సంజయ్ బావించారని తెలిసింది. చంద్రబాబు నాయుడు సీఎం కాకముందే జగన్ చెప్పినట్లు చేసిన ఆయన కోటారిలో ఒక ఐపీఎస్ అధికారి సెలవు పెట్టి వెళ్లిపోవడం చర్చకు దారితీసింది.
ఇక జగన్ కు వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భరతం పట్టడానికి కూటమి ప్రభుత్వం కౌంట్ డౌన్ మొదలైయ్యిందని తెలిసింది. ఇంతకాలం వైసీపీ ఆగడాలకు అండగా ఉన్న పోలీసు అధికారులు ఎవ్వరినీ వదలము అని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కలవరం మొదలైయ్యిందని తెలిసింది. ఇక చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు కావడానికి రోజులు దగ్గర పడుతున్నాయి.












Click it and Unblock the Notifications