తల్లికి దూరమైన దీప్తి, ఉన్నత విద్యకు సహయం చేస్తానన్న ఐజీ
బ్యూటీషీయన్ శిరీష కూతురు దీప్తిని సీఐడి ఐజీ సునీల్‌కుమార్ దత్తత తీసుకొన్నాడు. ఉన్నత చదువులు చదివేందుకుఆయన ముందుకు వచ్చాడు. గత నెల 12వ,తేదిన శిరీష ఆర్‌జె స్టూడియోలో ఆత్మహత్య చేసుకొంది.
పాలకొల్లు: బ్యూటీషీయన్ శిరీష కూతురు దీప్తిని సీఐడి ఐజీ సునీల్‌కుమార్ దత్తత తీసుకొన్నాడు. ఉన్నత చదువులు చదివేందుకుఆయన ముందుకు వచ్చాడు. గత నెల 12వ,తేదిన శిరీష ఆర్‌జె స్టూడియోలో ఆత్మహత్య చేసుకొంది.
కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి బ్యూటీషీయన్ శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు.
శిరీష ఆత్మహత్య కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు రోజుకో మలుపుతిరిగింది. శిరీష మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పోలీసులు కొట్టిపారేశారు.
శిరీష ఆత్మహత్య చేసుకోలేదని హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపించారు.అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శాస్త్రీయంగా రుజువు చేసేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించారు.

శిరీష కూతురు దీప్తి ఉన్నత చదువులకు ఆర్థికసహయం
బ్యూటీషీయన్ శిరీష కూతురు దీప్తిని ఉన్నత చదువులు చదివించేందుకు అవసరమైన సహయాన్ని అందించేందుకు ఏపీ సీఐడి ఐజీ సునీల్‌కుమార్ ముందుకు వచ్చారు. పాలకొల్లులోని ఆదిత్య పాఠశాలలో దీప్తిని ఆయన ఏడోతరగతిలో చేర్పించారు. డిగ్రీవరకు ఆమె చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని ఆయన ప్రకటించారు. శిరీష భర్త హైద్రాబాద్ బేగంపేటలోని ఓ స్వచ్చంద సంస్థలో వంటమనిషిగా పనిచేస్తున్నాడు

తల్లికి దూరమైన దీప్తి
బ్యూటీషీయన్ శిరీష మృతితో దీప్తికి తల్లి బిడ్డగా మారింది. రాజీవ్ , శ్రవణ్‌లతో కలిసి కుకునూర్‌పల్లికి వెళ్ళిన శిరీష అనుకోనిపరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఇంటికివస్తానని భర్తకు ఫోన్ చేసిన చెప్పిన శిరీష శవంగా మారింది.ఈ ఘటనతో దీప్తి తల్లికి దూరమైంది.తన ఆలనాపాలనా చూసుకోవాల్సిన సమయంలోనే దీప్తికి తల్లికి దూరం కావడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Recommended Video


శిరీష మృతితో హైద్రాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు
గత నెల 12వ,, తేదిన శిరీష ఆర్‌జె స్టూడియోలో ఆత్మహత్య చేసుకొని మరణించింది.అయితే ఆమె మరణించిన తర్వాత ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియల నిర్వహణ సందర్భంగా దీప్తితోపాటు శిరీష భర్త సతీష్‌చంద్ర కూడ పశ్చిమగోదావరి జిల్లా చేరుకొన్నారు.అయితే ఈ ఘటనపై రోజుకో రీతిలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కుటుంబసభ్యులు కూడ అనుమానాలను వ్యక్తం చేశారు.అయితే ఈ అనుమానాలను కూడ పోలీసులు కొట్టిపారేశారు.శిరీష అంత్యక్రియల సమయం నుండి దీప్తి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంటుంది.

శిరీష కేసులో విచారణ పూర్తి
బ్యూటీషీయన్ శిరీష కేసులో విచారణను పూర్తిచేశారు పోలీసులు. శిరీష ఆత్మహత్య చేసుకొందని నిర్ధారించారు.అంతేకాదు ఆమెపై అత్యాచారం జరగలేదని తేల్చారు. కానీ, ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని తేల్చారు.అయితే రాజీవ్, శ్రవణ్‌లకు ఈ కేసులో శిక్షపడేలా జాగ్రత్తలు తీసుకొంటామని పోలీసులుచెప్పారు. బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఈ నెల 11వ, తేదిన విచారణ జరగనుంది. అయితే నాలుగురోజుల క్రితం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయమై కోర్టు ఈ నెల 11న, విచారణ నిర్వహించనుంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications