రూ.550కోట్లకు పైగా అక్రమాస్తులు: గొల్ల వెంకట రఘు సస్పెన్షన్‌

అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

అమరావతి: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సెప్టెంబరు 26 నుంచి ఈ సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా రఘు స్టే పొందడాన్ని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రైబ్యునల్‌, హైకోర్టుల్లో కేవియట్‌ దాఖలు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం ప్రస్తుత సంచాలకుడిని ఆదేశించింది.

Andhra Pradesh country and town planning director golla venkata raghu suspended

కాగా, సెప్టెంబరు 25న రఘు అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. సెప్టెంబర్ 26న అరెస్టు చేసి విశాఖపట్నం న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆ న్యాయమూర్తి అక్టోబరు 9 వరకూ రిమాండ్ విధించారు.

ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసును వివరిస్తూ సస్పెండ్‌ చేయాలని ఏసీబీ శాఖ కోరగా ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఏసీబీకి చిక్కిన రఘు రూ.550కోట్లకుపైగా అక్రమాస్తులను కూడబెట్టిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+