Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంక్షల వలయంలో ఏపీ.. నైట్ కర్ఫ్యూ విధింపు.. కరోనా కట్టడికి జగన్ కీలక నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి మరలా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గురువారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు రావడంతో తీవ్ర భయాందోళకు గురుచేస్తోంది. కేసులు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కొన్ని రాష్ట్రాలు సూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నైట్ కర్ప్యూ విధించాలని నిర్ణయించింది.

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల రెండు రోజుల్లోనే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మరలా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన , తమిళనాడు, ఒడిషా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. సండే రోజు లాడ్‌డౌన్ విధించాలని సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అమలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా వికెండ్ కర్ఫ్యూ విధించాలని ఆదేశాలు ఇచ్చింది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోన కేసులు తక్కువ ఉన్నప్పటికీ.. వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేయాలంటే ఆంక్షలను కఠినతరం చేయాలన్న నిర్ణ‌యానికి సీఎం జగన్ వచ్చారు. నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.

 సంక్రాంతికి క‌రోనా ఉద్ధృతి ?

సంక్రాంతికి క‌రోనా ఉద్ధృతి ?

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వాసులంతా సంక్రాంతి పండగకు తమ స్వగ్రామాలకు రానున్నారు. ఈనేపథ్యంలో కేసులు సంఖ్య పెరుగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకోని రాష్ట్రంలో కూడా శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది.

 పొరుగు రాష్ట్రాల్లో వికెండ్ లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూ..

పొరుగు రాష్ట్రాల్లో వికెండ్ లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూ..


తమిళనాడు, కర్ణాటక, ఒడిషాల్లో ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. తమిళనాడులో 8,449 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒడిషాలోనూ గడిచిన 24 గంటల్లో 8,237 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్ణాటకలో 6,983 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఒడిషా రాత్రి 9 గంటల నుంచి..ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. తమిళనాడులోనూ రాత్రి పూట కర్ఫ్యూ తో పాటు వికెండ్ లాక్ డౌన్ అమలు చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం వారంతరపు కర్ఫ్యూ విధిస్తుంది. అవరసమైతే రాత్రి పూట కూడా కర్ఫ్యూ విధిస్తామని తెలిపింది.

Recommended Video

    #TelanganaLockdown : 10Am దాటినా రోడ్డు మీద తిరుగుతున్న కార్లు!!
    ముంబైలో ద‌డ‌పుట్టిస్తున్న వైర‌స్

    ముంబైలో ద‌డ‌పుట్టిస్తున్న వైర‌స్


    మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండం చేస్తోంది. ముంబైలో ఒక్క‌రోజులోనే 20,000 కేసులు న‌మోదు కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దిశగా సీఎం ఉద్దవ్ ఠాక్రే సర్కార్ యోచిస్తోంది. కరోనా, ఒమిక్రాన్ కేసులకు ముంబై హాట్ స్పాట్ గా మారింది. దేశంలో నమోదవుతున్న‌ కేసుల్లో దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కేంద్రం కూడా లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూలపై పరిస్థితులను బట్టి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఇటీవల మహానగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. అయినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈనేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలను బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అదికారులు పేర్కొంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+