గత ప్రభుత్వం అరాచకాలు ధైర్యంగా వచ్చి చెప్పండి, మీకు చంద్రబాబు ఉన్నారు, మంత్రి
రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు కూడా ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి తెలుగుదేశం పార్టీలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో రికార్డుల తారుమారు, ఆన్ లైన్ ట్యాపరింగ్ పై అధికారులకు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

రెవిన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులను కూడా బెదిరించి వారి భూములు బలవంతంగా లాక్కున్నారని ప్రజలకు ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

కూటమి ప్రభుత్వానికి చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడంతో వారికి న్యాయం చెయ్యడానికి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రెవెన్యూ సభల్లో గ్రామస్థాయి అధికారుల నుండి స్థానిక జిల్లా కలెక్టర్ వరకు పాల్గొంటారని, ప్రజలకు ధైర్యంగా ముందుకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని, వారి సమస్యల్ని అధికారులకు చెప్పాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు మనవి చేశారు.
ఇటీవల పుంగనూరులో పర్యటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులు ఆక్రమించిన ప్రభుత్వ భూములు అన్నిటిని స్వాధీనం చేసుకుంటామని, పెద్దిరెడ్డి అరాచకాలు చెక్ పెడతామని పుంగనూరు నియోజక వర్గంలోని రాగానిపల్లెలో జరిగిన బహిరంగ సభలో స్థానిక ప్రజలకు హాబీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వైసిపి ప్రభుత్వం లో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు.












Click it and Unblock the Notifications