ఏపీలో ప్రతి మహిళకు రూ.5 లక్షల రుణం... అప్లై ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబునాయుడు మహిళల స్వయం ఉపాధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్త్రీ సంపాదిస్తే ఆ ఇల్లు మొత్తం లక్ష్మీదేవితో కళకళలాడుతుందని, పేదరికం అనేదే ఉండదనేది చంద్రబాబు ఆలోచన. అందుకనుగుణంగా వారి స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా పథకాలను తీసుకువస్తున్నారు. చంద్రబాబునాయుడు ఏ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ సమయంలో డ్వాక్రా మహిళలకు మాత్రం స్వర్ణయుగంలాంటిదని చెప్పొచ్చు. తాజాగా డ్వాక్రా మహిళలకు భారీగా రుణాలివ్వబోతున్నారు.
వడ్డీ లేని రుణంగా రూ.320 కోట్లు
ఇప్పటికే ఉన్న యూనిట్లతోపాటు, కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం అందజేస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ మహిళలకు రూ.50వేల రాయితీ ఇవ్వనున్నారు. వచ్చే నెల మొదటివారం నుంచి రాష్ట్రంలో లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు. వీరి స్వయం ఉపాధి ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేయనుండగా, ఇందులో రూ.180 కోట్లను రాయితీగా తీసేస్తారు. అలాగే మరో రూ.320 కోట్లను వడ్డీలేని రుణంగా అందిస్తారు. ఇప్పటికే తొలి విడత ప్రాజెక్టులకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.8 కోట్ల రాయితీని జమచేసింది.

రుణాల కోసం బ్యాంకర్లతో ఇబ్బందులు
ప్రభుత్వం రాయితీ సొమ్మును విడుదల చేసినా బ్యాంకర్లతో రుణాలిప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే దీనికి విరుగుడుగా కేంద్రం నిధుల్ని సెర్ప్ కు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలివ్వబోతున్నారు. ఉన్నతి పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయితీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయకుండా రుణ వాయిదాల్లో చివరగా మినహాయించుకునే పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా డ్వాక్రా సంఘాలకు రుణాలివ్వడం అనేదే కీలకమని, వారికి రుణాలివ్వాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications