ఎపి:రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ...ఒకేసారి 14 మందికి స్థానచలనం
అమరావతి: ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. ఈమేరకు ఒకేసారి 14 పోలీసు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బదిలీ కూడా ఉండటంతో ఆయన ట్రాన్స్ ఫర్ అరకు మావోయిస్టుల దాడి నేపథ్యంలో వేటుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ను విశాఖ సిట్ కు బదిలీ చేశారు. పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్ పాటిల్ ను చిత్తూరు ఎస్పీగా నియమించారు. రాష్ట్రంలో బదిలీ అయిన 14 మంది ఐపిఎస్ అధికారుల వివరాలు...

ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీ విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ...చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్ ఎస్పీగా...విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కడప ఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
ఇక పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్ పాటిల్‌కు చిత్తూరు ఎస్పీగా బదిలీ కాగా...చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్ ను తిరుపతి అర్బన్ ఎస్పీగా, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను విశాఖ సిట్‌కు పంపించారు. గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్ ఆర్డర్‌కు, నెల్లూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు నియమించారు.
కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్‌కు, కర్నూల్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీని తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ బాధ్యతలు అప్పగించారు. నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్‌కు గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే మరికొద్దిసేపట్లో ఐఎఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications