Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణకు డబ్బుంటే ఏపీకి దమ్ముంది, బాబులో సత్తా: అశోక్ బాబు

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలో మహా సంకల్ప దీక్ష సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. స్వర్ణాంధ్ర కోసం మహా సంకల్పం పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన తెలుగులో ప్రసంగించారు. ఏడు కొండల వెంకన్న, మంగళగిరి లక్ష్మీ నర్సింహ స్వామి, కనకదుర్గ ఉన్న భూమి ఇది అన్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ ఏడాది పూర్తి చేసుకుందని, ఇది అరుదైన రోజు అని గవర్నర్ చెప్పారు. అమరావతి రాజధాని కోసం మొన్ననే పునాది రాయి వేశారని, ఇవాళ మహా సంకల్పానికి శ్రీకారు చుట్టారని నరసింహన్ అన్నారు.

రాజకీయ కుట్రతో విభజన: అశోక్ బాబు

Andhra Pradesh have guts to build international level Capital: Ashok Babu

రాజకీయ కుట్రతో విభజన జరిగిందని ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి డబ్బు ఉండవచ్చునని, ఏపీకి మాత్రం దమ్ము ఉందని అశోక్ బాబు అన్నారు. హైదరాబాదును మించిన నగరాన్ని నిర్మించగల సత్తా ఉన్న నాయకుడు మనముందు ఉన్నారని, చంద్రబాబుకు మేమంతా సహకరిస్తామని చెప్పారు.

ఎండా, వాన లెక్క చేయకుండా ఉద్యోగులు ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తారని అశోక్ బాబు చెప్పారు. ఉద్యోగుల కోసం చంద్రబాబు ఎంతో చేశారన్నారు. పదేళ్లలో అద్భుతన రాజధానిని నిర్మించుకోగలమన్నారు. ఏపీకి మంచి అవకాశాలున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ హామీలు నెరవేర్చుకున్నారని మరో ఉద్యోగ సంఘ నేత అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాదును తలదన్నేలా అమరావతిని నిర్మిస్తామన్నారు.

నిజాం నవాబులు జనాలకు ఉపయోపగడేది ఏం కట్టారని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు ప్రయత్నం వల్లే నేడు బెంగళూరు, అమెరికాల్లో యువత ఉద్యోగాలు సాధిస్తుందన్నారు. మనకు ముందుచూపు ఉన్న నాయకుడు ఉన్నాడన్నారు.

దొంగలు దొంగల పార్టీలోనే చేరుతారనేందుకు మరో ఉదాహరణ అని బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఓ మహిళా టీడీపీ నేత వ్యాఖ్యానించారు.

ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి జగన్ గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్‌తో కుట్ర పన్ని ఇప్పుడు చంద్రబాబును ఇరికించేందుకు గవర్నర్ వద్దకు వెళ్లారని ఆరోపించారు. ఇప్పటికే వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+