ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల: మే 5-23 వరకు, మార్చి నుంచి ప్రాక్టికల్స్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 5 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మే 2 నుంచి 22 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
కాగా, పరీక్షలన్నీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:
మొదటి సంవత్సరం
తేదీ పరీక్ష
మే 5 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మే 7 ఇంగ్లీష్
మే 10 గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం
మే 12 గణితం పేపర్ 1బీ, జీవశాస్త్రం, చరిత్ర
మే 15 భౌతికశాస్త్రం, అర్ధశాస్త్రం
మే 18 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మే 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్
మే 22 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ పేపర్ 1
రెండో సంవత్సరం
తేదీ పరీక్ష
మే 6 సెకండ్ లాంగ్వేజ్
మే 8 ఆంగ్లం
మే 11 గణితం పేపర్ 2ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం
మే 13 గణితం పేపర్ 2బీ, జువాలజీ, చరిత్ర
మే 17 భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం
మే 19 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మే 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మేథ్స్
మే 23 మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ
ఇక మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 24న ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చి 27న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications