Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSIPB: లక్ష కోట్ల ప్రాజెక్టులు -85 వేల ఉద్యోగాలు-చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

ఏపీలో కూటమి సర్కార్ పెట్టుబడుల వరద పారిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు అనుకూలమైన వాతావారణాన్ని కల్పిస్తూనే మరోవైపు పారిశ్రామిక వేత్తల్ని స్వయంగా కలిసి ఆహ్వానాలు పలుకుతోంది. దీని ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. ఇవాళ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో లక్ష కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో 85870 ఉద్యోగాలు రాబోతున్నాయి.

రాష్ట్రంలో క్లస్టర్ వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని సీఎం చంద్రబాబు 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆకాంక్షించారు. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు ఉంటాయన్నారు. గత 16 నెలలుగా జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05870 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

Andhra Pradesh Investment Board Clears 1 01 Lakh Cr Projects Creating 85 870 Jobs

పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు...అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సూచించారు. ఇవాళ్టి సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. వీటి ద్వారా రూ. 1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి.

రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యతని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలన్నారు. ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉందని, విశాఖ, తిరుపతి మెగా సిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు.

Andhra Pradesh Investment Board Clears 1 01 Lakh Cr Projects Creating 85 870 Jobs

ఈ నెల, 14,15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనల్లో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులను భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించానని.. వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని.. అలాగే భాగస్వామ్య సదస్సుకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+