ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్: భారీగా పెట్టుబడులు, కరోనా సమయంలోనూ ఆకర్షించింది
అమరావతి: ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఏపీలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు నిదర్శనంగా ఇన్వెస్ట్ ఇండియా తాజాగా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు నిలిచాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో ఏపీ టాప్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా అగ్రస్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఏపీకి వచ్చాయిని 'ది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెట్ ఆఫ్ ఇండియా (Invest India)' పేర్కొంది.

ఏపీకి కలిసొచ్చిన అంశాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కి.మీ. మేర దేశంలో రెండో పొడవైన తీర ప్రాంతం ఉండటం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండటం కారణంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. కాగా, 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 123,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండటం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నందున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది.
ఏపీ సర్కారుకు బూస్ట్ లభించినట్లే..
అంతేగాక రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండటంతోపాటు కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో నీటి వనరులు సమృద్ధిగా ఉండంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నాయి. ఇక 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణం అని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. ప్రతిపక్షాల నుంచి పెట్టుబడులు రావడం లేదంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సర్కారుకు ఈ వార్త కొండంత బలాన్నిచ్చేది ఉందని చెప్పవచ్చు. దీంతో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు గట్టిగానే బదులిచ్చే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications