జగన్ ను చూసి ప్రజలు ఏమంటున్నారో తెలుసా ?, వచ్చేసారి ఒక్కసీటు కూడా రాదు

దేశంలో సీఎంగా పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఇంతవరకు జగన్ చెప్పినన్ని అపద్దాలు ఎక్కడా చెప్పలేదని ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు జగన్ అబద్దాలు చెప్పి బతికేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. జగన్ చెబుతున్న అబద్దాలు ఏ దేశంలో ఏమాజీ ముఖ్యమంత్రి కూడా ఇంత వరకు చెప్పలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

ఐదు సంవత్సరాలు సీఎం గా పనిచేసిన ఓ నాయకుడు ప్రజల ఇన్ని కష్టాల్లో ఉంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వం పైన నిందలు వేసి కాలం గడిపేయడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు . బుడమేరు, డైవర్షన్ కెనాల్, రెగ్యులేటర్ ఎక్కడ ఉన్నాయి, గండ్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయి ? కృష్ణా నది ప్రవాహాలు ఎలా వచ్చింది అని కనీస అవగాహన లేకుండా జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

Andhra Pradesh minister made sensational comments on former CM Jagan

ఓ అబద్దాన్ని పట్టుకొని పదేపదే మాట్లాడుతూ దానిని ప్రజలను నమ్మించడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గత పది రోజుల నుండి విజయవాడలో వరద బాధితులు నానా తంటాలు పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడానికి కనీసం ప్రయత్నం కూడా చేయని మాజీ సీఎం జగన్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అసత్యాలతో అధికారం అడ్డం పెట్టుకుని కాలం గడిపేసిన జగన్ కి ప్రజలు బాధ పడుతున్నారని కనీసం ఆలోచించడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రజలకు కష్టాలు పట్టించుకోని నాయకుడు సొంత పార్టీ నాయకుల ప్రయోజనాల కోసం బురద రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు.

Andhra Pradesh minister made sensational comments on former CM Jagan

గతంలో పంటలు కాల్చి బూడిద చేసిన నందిగం సురేష్ ను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ చేస్తున్న పనులు అన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ కు ఎందుకు 11 సీట్లు ఇచ్చి తప్పు చేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రజలు జగన్ కి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితులులేవని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+