మంత్రి నారా లోకేష్ మనవి, వైసీపీ దెబ్బ కొట్టాలని ప్లాన్, సీన్ రిపీట్!!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి పార్టీలలో తెలుగుదేశం పార్టీ పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు.
జగన్ సీఎం అయిన తరువాత వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏరైంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీల సభ్యత్వం తీసుకోవాలంటే ప్రజలు భయపడిపోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టాలని టీడీపీ పక్కాప్లాన్ చేస్తోంది టీడీపీ సభ్యత్వ కార్యక్రమం రికార్డు స్థాయిలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు సూచించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైయ్యిందని, ప్రతిఒక్కరూ రూ 100 చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు మనవి చేశారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తలకు రూ 5 లక్షల ప్రమాద భీమా ఉంటుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని…
— Lokesh Nara (@naralokesh) October 26, 2024
గతంలో టీడీపీ కార్యకర్తల కోసం కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీదే అని, టీడీపీ సభ్యుత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యుల వైద్య, విద్య, ఉద్యోగాల బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్టు చేశారు. వెబ్ సైట్, మొబైల్, వాట్సాప్ లో టీడీపీ సభ్యత్వం తీసుకోవచ్చని, ప్రతి టీడీపీ కార్యకర్తకు మేము అండగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభిమానులకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడానికి టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications