Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేడా కొడితే అంతే కథ, హ్యాట్రిక్ కొట్టాలని రోజా ఆశ, కుర్చి మడతపెట్టి కొట్టాలని రెబల్స్ పగ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ నియోజక వర్గాల్లో నగిరి ముందు వరుసలో ఉంది. మంత్రి ఆర్ కే రోజా అలియాస్ రోజా మరోసారి నగిరి నుంచి వైసీపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్నారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి ఆర్ కే రోజా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నగిరిలోని వైసీపీ నాయకులు మాత్రం ఎలాగైనా కుర్చి మడతపెట్టి కొట్టి మంత్రి రోజాను ఓడించాలని బహిరంగంగానే ఆమెకు వ్యతరేకంగా ఎన్నికల ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే టక్కున మంత్రి రోజానే గుర్తొస్తారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తున్న మంత్రి రోజా నగిరిలో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో నగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో నిండ్ర, పుత్తూరు, నగిరి, విజయాపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి.

Andhra Pradesh Minister Roja is making many attempts to achieve a hat-trick in Nagiri

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో వడమాల, పుత్తూరు మండలాలు నగరి పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సినీనటి రోజా వైసీపీ అభ్యర్ధిగా నగిరిలో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఎమ్మెల్యే అయిన తరువాత రోజా నగరిని ఆమె తన అడ్డాగా చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి రోజాకు టిక్కెట్ ఇచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా కేవలం 2, 708 ఓట్ల మెజారిటీతో రోజా వరుసగా రెండో విజయం అందుకున్నారు. ఇదే నగిరి నియోజక వర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేసిన రాకేష్ రెడ్డికి 3, 357, బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎన్, ప్రవల్లికా యాదవ్ కు 3, 044 ఓట్లు వచ్చాయి

నగిరిలో మొదటి సారి 858 ఓట్లతో ఎమ్మెల్యే అయిన రోజా తరువాత 2, 708 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నగిరిలోని ఐదు మండలాల్లోని వైసీపీ సీనియర్ నాయకురాలు, పుత్తూరు వైసీపీ కౌన్సిలర్, ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి భువనేశ్వరి రోజా మీద తిరుగుబాటు చెయ్యడం, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోవడంతో మంత్రి రోజాకు ఎదురు దెబ్బ తగిలింది.

Andhra Pradesh Minister Roja is making many attempts to achieve a hat-trick in Nagiri

2024 ఎన్నికల్లో నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించి రోజాను మరోసారి ఎమ్మెల్యే చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు ఇప్పటికే మీడియా ముందు తేల్చి చెప్పారు. ఇంత జరిగినా నగిరిలో మరోసారి వైసీపీ టిక్కెట్ రోజాకు ఇచ్చారు.

ఇక వైసీపీలో పెద్దాయనగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో కూడా గొడవలు పెట్టుకున్న రోజా ఆయన సహకారం కూడా పొందలేకపోతోంది. అయితే రోజా మీద నమ్మకం వుంచిన సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆమెకు అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను నగిరి అభ్యర్ధిగా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే నగిరిలో పర్యటించిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మంత్రి రోజా మీద దుమ్మెత్తిపోశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+