ఏపీలో కొత్త కరోనా కేసులు: ఆ జిల్లాల్లో అధికం
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. పూర్తిగా కేసులు తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,515 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుమంది మరణించారు. 903 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,09,245కు చేరింది. ఇందులో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,80,407కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 15,050గా నమోదైంది. 13,788 మంది మృతి చెందారు.
తూర్పు గో్దావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 223 కొత్త పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 202, చిత్తూరు జిల్లాలో 199 కేసులు వెలుగులోకి వచ్చాయి. జిల్లావారీగా మొత్తం కేసులు అనంతపురం-26, గుంటూరు-129, కడప-89, కృష్ణా-163, కర్నూలు-13, ప్రకాశం-132, శ్రీకాకుళం-61, విశాఖపట్నం-79, విజయనగరం-56, పశ్చిమ గోదావరి-143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

యాక్టివ్ కేసులు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. కృష్ణాలో 2,401, తూర్పు గోదావరి జిల్లాలో 2,355 యాక్టివ్ కేసులు ఈ జిల్లాలో నమోదయ్యాయి. నెల్లూరులో 2,266 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ మూడు జిల్లాల తరువాత చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. చిత్తూరు-1,789, ప్రకాశం-1,644 కేసులు యాక్టివ్‌గా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,460, గుంటూరు జిల్లాలో 1,002 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మిగిలిన జిల్లాల్లో వెయ్యికి లోపే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే ఓ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నందున.. ప్రస్తుతానికి థర్డ్ వేవ్ ప్రభావం లేనట్టేనని పేర్కొన్నారు. కాగా, థర్డ్ వేవ్ ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనడానికి ముందు నుంచే సంసిద్ధంగా ఉన్నామని, దీనికి తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసుకున్నామని తెలిపారు.
Recommended Video
థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా పడే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నందున.. దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేక వార్డులను సంసిద్ధంగా ఉంచామని అధికారులు చెప్పారు. సెకెండ్ వేవ్ తరహా పరిస్థితులు రాష్ట్రంపై పడనివ్వబోమనే ధీమాను అధికారులు వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications