ఏపీలో కరెంట్ కోతలు ఉండకుండా చంద్రబాబు ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రజల, రైతుల అవసరాలకు మరియు పరిశ్రమలకు కోతలు లేని విధంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దాదాపు 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

వారి ఖాతాల్లో రూ. 25వేలు జమ.. చీరాలలో నేతన్న సేవలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వారి ఖాతాల్లో రూ. 25వేలు జమ.. చీరాలలో నేతన్న సేవలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఏపీలో బాగా పెరిగిన విద్యుత్ వినియోగం

ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న క్రమంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు యూనిట్లు ఏర్పాటు జరుగుతోంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా గణనీయంగా పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగింది. ఈసారి వర్షాకాలం పెద్దగా వర్షాలు లేకపోవడం, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం కారణంగా ఏపీలో ఈ వర్షాకాలం కూడా విద్యుత్ వినియోగం ఎక్కువైంది.

 జగన్ అండ్ కో ను కంట్రోల్ చేయడానికి రెండు నిమిషాలు చాలు.. కానీ- చంద్రబాబు..!!
జగన్ అండ్ కో ను కంట్రోల్ చేయడానికి రెండు నిమిషాలు చాలు.. కానీ- చంద్రబాబు..!!
Andhra Pradesh Plans to Buy 1 600 MW Thermal Power to Meet Rising Demand from ap people

ధర్మల్ పవర్ కొనుగోలు చెయ్యాలని నిర్ణయం

గృహ వినియోగంతో పాటు వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ సరఫరా నిరంతరం అందించవలసిన రావడంతో గ్రిడ్ పైన ఒత్తిడి బాగా పెరిగింది. ఒక కొత్త ఉదయం సోలార్ పవర్ పనిచేస్తున్నప్పటికీ, సాయంత్రం పీక్ అవర్స్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో థర్మల్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

1,600 మెగావాట్ల కొనుగోలు కోసం టెండర్ లు

సాయంత్రం విపరీతమైన లోడ్ పెరుగుతున్న క్రమంలో సాయంత్రం వేళల్లో గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి థర్మల్ విద్యుత్ కొనుగోలు చెయ్యాలని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ 1,600 మెగావాట్ల కొనుగోలు కోసం బహిరంగ మార్కెట్లో లేదా వివిధ పవర్ ప్లాంట్ల నుంచి టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయాలని, టెండర్లు వచ్చిన సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులు దృష్టి సారించారు.ఈ కొనుగోలు పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత కరెంట్ కోతలు లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది.

అన్ని వర్గాలకు పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలోని గృహ అవసర వినియోగదారులతో పాటు, రైతులకు, రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పడుతున్న పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కరెంటు విషయంలో అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+