ఏపీని హెచ్చరించిన వాతావరణశాఖ

కోస్తా తీరాన్ని వణికించిన మిగ్ జాం తుఫాన్ ఈ నెల 5న బాపట్ల దగ్గర తీరం దాటింది. ఈ తుఫాను కోస్తా, తెలంగాణ మీదగా పయనించే క్రమంలో బలహీనపడి
అల్పపీడనంగా మారింది. శుక్రవారానికి దక్షిణ చత్తీస్ గఢ్, విదర్భ పరిసరాల్లో ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం మూడు రోజులు ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. దీనివల్ల రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్చ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుంది.

Andhra Pradesh Rains Update

అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 75.2 మిల్లీ మీటర్లు, అనకాపల్లి జిల్లా చోడవరంలో 74.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 66.8, కాకినాడ జిల్లా తునిలో 59.5, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 56.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 45.2, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 43.8, విజయనగరం జిల్లా వేపాడలో 37.2, అనకాపల్లిలో 36.6, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 33.2, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 31.6, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 21.2, పార్వతీపురంలో 21.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగ్ జాం ప్రభావంతో ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అందుతున్న దశలో ఉన్న పంట తుఫాను ధాటికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+