Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Pensions:అవ్వాతాతలకు తీవ్ర నిరాశ..బ్యాంకుల్లో సర్వర్ డౌన్ బోర్డు..అందని పెన్షన్..!

ఏపీలో పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మే రెండవ తేదీ వచ్చినా పెన్షన్ అందక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయాల దగ్గర మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.మాకీ కష్టం ఎందుకురా భగవంతుడా అనే మహిళలు కూడా లేకపోలేదు.సాధారణంగా ఒకటవ తేదీకే వాలంటీర్లు ఇంటికొచ్చి తలపుతట్టి అర్హులైన వారికి పెన్షన్ అందజేసేవారు. అయితే గత నెల నుంచి పెన్షనర్లు తమకు పెన్షన్ అందుతుందో లేదో అన్న అయోమయానికి గురవుతున్నారు.

పింఛన్లకు బ్రేక్ కారణం అతనే

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లకు బ్రేక్ పడటంతో పాటు చాలా పథకాలు కూడా ఆగిపోయాయి. సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఇంటివద్దకు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించకుండా ఈ కార్యక్రమంపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటివద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Andhra Pradesh Server Glitches Dash Hopes of Elderly Pensioners at Banks criticize TDP and Chandrababu

గత నెల అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. అయితే మండుటెండలో వృద్ధులు పింఛన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు కూడా. ఇక మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పింఛన్ అందలేదు. బ్యాంకులకు వెళ్లాలి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకులో అకౌంట్ లేదు. వారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Andhra Pradesh Server Glitches Dash Hopes of Elderly Pensioners at Banks criticize TDP and Chandrababu

బ్యాంకుల వద్ద సర్వర్ డౌన్ బోర్డులు

ఇక బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న ఆశ వారిలో కనిపించింది. ఉదయం 11 గంటల వరకు క్యూ లైన్‌లో నిల్చున్నారు. చివరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్ కోసం వేచిఉన్న మహిళలు కలత చెందారు. ఆవేదనతో ఇంటిముఖం పట్టారు. బ్యాంకులో సర్వర్ పనిచేయడం లేదని రేపు రమ్మంటున్నారంటూ మహిళలు చెప్పారు. అయితే రేపు కూడా ఇస్తారో లేదో అన్న నమ్మకం తమకు లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

పెన్షన్లు సకాలంలో అందకపోవడానికి కారణం టీడీపీ చంద్రబాబే అంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. వృద్ధులు ఏకంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న దృశ్యాలు బ్యాంకుల వద్ద కనిపించాయి. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు నిరాటంకంగా వచ్చిన పెన్షన్లు.. గత రెండు నెలల నుంచి ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.పేదవాళ్లకు ఈ పింఛన్ డబ్బులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్న అవ్వ తాతలు... జగన్ పై ప్రతిపక్షాలు కక్షగట్టాయంటూ వృద్ధులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+