Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఐజీ వినీత్ నేతృత్వంలో సిట్: సభ్యులు వీరే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది.

ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సెట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సెట్ విచారణ జరపనుంది. రెండు రోజుల్లో నివేదికను ఎన్నికల సంఘానికి సెట్ సమర్పించనుంది.

Andhra Pradesh state government set up sit on election violence

ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు, సభ్యులు వీరే

ఏసీబీ ఎస్పీ రమాదేవి,
ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం)
సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు)
ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి)
వి.భూషణం (గుంటూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌)
వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌)
రామకృష్ణ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌)
జి.ఎల్‌.శ్రీనివాస్‌ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌)
మోయిన్‌ (ఒంగోలు పీటీసీ)
ప్రభాకర్‌ (అనంతపురం ఏసీబీ)
శివప్రసాద్‌ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌)

సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది ఈసీ. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి నివేదించింది సీఈవో కార్యాలయం. కాగా, సిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. అంతేగాక, విధుల్లో నిర్లక్ష్య వహించి.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైనా తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు, ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. ఇప్పటికే ఏపీకి 20 కంపెనీల పారామిలటరీ బలగాలు చేరుకున్నాయి. మరోవైపు, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+