బెంగాల్ సీఎం సువేందుకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమ్ బెంగాల్ సీఎం సువేందు అధికారికి ఘోర విమాన ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ను కోలాఘాట్‌ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు దుముమ్ నుంచి కేశ్‌ పూర్‌ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా పైలెట్ అప్రమత్తమై సీఎం సువేందు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ను పుర్బా మేధినిపూర్ జిల్లాలోని కోలాఘాట్‌ లో ల్యాండింగ్ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సీఎం సువేందు కోలఘాట్ నుండి రోడ్డు మార్గం ద్వారా కేశ్‌ పూర్‌ లోని కార్యక్రమం వేదికకు చేరుకున్నారు.

మరోవైపు బెంగాల్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అనేక ప్రాంతాల్లో ప్రతి కూల వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. అటు వాతావారణ పరిస్థితుల ప్రభావం రవాణాపైనా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం సువేందు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Bengal CM Suvendu adhikari news Helicopter mishap averted for Bengal CM Suvendu emergency landing

ఇక ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు బ్యాడ్ వెదర్ మాత్రమే కారణమా..? లేక మరేదైనా రీజన్ ఉందా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్జీకర్ హత్యాచార కేసులో బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై మరోసారి దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగాల్ సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని సీఎం కీలక ఆరోపణలు చేశారు. 2024 లో ఆగస్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+