125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

అమరావతి: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్‌లోని కింది అందస్తును బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముందుగా తాత్కాలిక సచివాలయంలోకి వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల కార్యాలయాలను సంబంధిత శాఖల మంత్రులు ప్రారంభించనున్నారు.

అనంతరం సచివాలయ ఉద్యోగులు మంత్రుల సమక్షంలో లాంఛనంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా జూన్ నుంచి అమరావతి నుంచే పరిపాలనను కొనసాగించినట్లు అవుతుంది. అయితే తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరిగిన తీరు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

సచివాలయంలోని ప్రారంభంకానున్న ఐదో బ్లాక్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం మొత్తాన్ని నిర్మాణ సంస్ధలు కేవలం 125 రోజుల్లనే పూర్తి చేయడం విశేషం. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనంలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది అంతస్తు ఉండగా కొన్ని పనులు మినహా అన్ని వసతులతో నిర్మాణం దాదాపుగా పూర్తయింది.

ఇంత తక్కువ సమయంలో వేగంగా పనులు పూర్తి కావడం వెనుక భారీ కసరత్తే జరిగింది. జూన్ 27 నుంచి అమరావతి నుంచే పరిపాలనను కొనసాగించాలని తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో నిర్మాణ సంస్ధలు కూడా దీనిని సవాలుగా స్వీకరించాయి.

తద్వారా తాత్కాలిక సచివాలయం నిర్మాణం యజ్ఞం మాదిరి నిరాటంకంగా, యుద్ధ ప్రాతిపదికన సాగింది. అంతేకాదు నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంవల్లే ఇదంతా సాధ్యమైందని నిర్మాణ సంస్ధల ప్రతినిధులు తెలిపారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఆ తర్వార సరిగ్గా వారం రోజుల తర్వాత... అంటే, ఫిబ్రవరి 24న నిర్మాణ సంస్ధలు పనులను ప్రారంభించాయి. ఈ నిర్మాణాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపట్టగా... సీపీ కుక్రేజా, ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌ఫ్రా సంస్థలు కన్సల్టెంట్లుగా వ్యవహరించాయి. నిజానికి వెలగపూడిలో భూములు నల్లరేగడి నేలతో కూడుకున్నవి.

కాబట్టి నిర్మాణం ఇతర నేలలతో పోల్చితే కాస్తంత సంక్లిష్టం. దీనికి అనుగుణంగా నిర్మాణ సంస్ధలు ముందస్తు ప్రణాళికలు రచించాయి. భవనానికి పునాదులను పటిష్ఠంగా వేశారు. ఒక్కో భవనానికి 300పైగా పైల్‌ వేశారు. ఒక్కో పైల్‌ను వంద అడుగుల లోతున ఆధునిక యంత్రాలతో బోర్లు తీశారు. మూడు పైల్స్‌ను కలిపి భూ మట్టంపై కత్తిరించి, అక్కడి నుంచి పిల్లర్లు వేశారు.

పీటీ బీమ్స్‌ను ప్రిఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో తయారు చేయించి, వాటిని భారీ శానీ క్రేన్లతో నిలబెడుతూ కేవలం రెండు రోజుల్లో ఒక్కొక్క శ్లాబ్‌ను వేశారు. మనుషులు వేస్తే ఎన్నో రోజులు పట్టే పెయింటింగ్‌ పనులను మెషీన్ల సాయంతో అదీ ఐదు కోటింగ్‌లను కొద్ది రోజుల్లోనే వేశారు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

ఇక బిల్డింగ్ అంతర్గత పనుల్లో భాగమైన ఎంఈపీ (మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌, ప్లంబింగ్‌) సంబంధిత పనులకు కనీసం 4 నెలలైనా అవసరం కాగా ప్రత్యేక ప్రణాళికతో 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేసేశారు. గదుల నిర్మాణానికి తేలికపాటి బ్రిక్స్‌ను తెప్పించారు. వాటితోనే గదుల నిర్మాణానికి పార్టిషన గోడలను నిర్మించారు. అంతస్తుకు పిల్లర్‌ 13 అడుగుల ఎత్తు వేశారు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

భవనం లోపల 12 అడుగు�� ఎత్తు ఉండేలా నిర్మించారు. ఈ భవనం సివిల్‌ పనులకు ఎల్‌ అండ్‌టీ సంస్థ 400 మందిని సిబ్బందిని వినియోగించింది. పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మరో 300మంది కూలీలను రప్పించి పనులను పరుగులు తీయించింది. అలాగని నాణ్యతా ప్రమాణాలు, ప్రమాద నివారణ చర్యల్లో ఎక్కడా రాజీ పడలేదు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

అత్యధునాతన ఫైర్‌ డిటెక్షన, ఫైర్‌ ఫైటింగ్‌ (స్ర్పింక్లర్ల ద్వారా), ప్రత్యేక ఫైర్‌ స్టెయిర్‌ కేస్‌ నిర్మాణం వంటి ఏర్పాట్లనూ పకడ్బందీగా చేశారు. సెంట్రలైజ్డ్‌ ఏసీ, టాయ్‌లెట్లు, లైటింగ్‌, ఇండోర్‌ సబ్‌స్టేషన, తాగునీటి సరఫరా, డ్రైనేజీ ఇత్యాది సౌకర్యాలనూ కల్పించారు. ఈ కాంప్లెక్స్‌కు దారి తీసే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంతోపాటు ఇతర అనుసంధాన రహదారులు, అంతర్గత రోడ్లను శరవేగంగా చేపట్టారు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

మరోవైపు తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పనులపై ఆరా తీశారు. మంత్రి నారాయణకు, సీఆర్డీయే అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. మంత్రి నారాయణ మందడంలో ఓ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి రోజూ వెలగపూడిలోని సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

తన పుట్టినరోజు నాడు కూడా మంత్రి తాత్కాలిక సచివాలయంలోనే ఉండటం విశేషం. మంత్రి ���ారాయణ ఒక కార్యదక్షుడి మాదిరి తాత్కాలిక సచివాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు వారం-పది రోజులకొకసారి వెళ్లి పనుల తీరును సమీక్షించేవారు.

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

125 రోజుల్లోనే!: కార్యదక్షుడు మంత్రి నారాయణ, వెంటపడ్డ చంద్రబాబు (ఫోటోలు)

ఇలా 125 రోజుల్లోనే తాత్కాలిక సచివాలయం పూర్తి కావడం పట్ల ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు నిర్మాణ సంస్దలు ఎల్‌ అండ్‌ టీ, షాపూ���్జీ కంపెనీల ప్రతినిధులు కూడా దీనిని ఓ రికార్డుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+