టెట్ 2018 ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2018 ఫలితాలను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్ కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు.
మొత్తంగా ప్రతి సబ్జెక్ట్ లోనూ 90కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 25శాతం మంది ఉన్నారన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. టెట్ ఫలితాలను సంబంధిత వైబ్ సైట్ (aptet.apcfss.in) లో పొందుపరిచారు.

ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సోమవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
విజయవాడలో టెట్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పారు. సుమారు 10 వేల ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అనుమతిని కోరుతూ ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications