ఏపీ టెట్ ఫలితాలు విడుదల: అర్హత సాధించింది 57శాతం

విశాఖపట్నం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించింది 57.48శాతం మాత్రమే కావడం గమనార్హం. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా, 3,70,573మంది పరీక్షకు హజరయ్యారు. ఇందులో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

Andhra Pradesh TET results released by minister Ganta Srinivasa Rao

పేపర్‌-1లో 69.36 శాతం, పేపర్‌-2ఏ సోషల్‌లో 45.1 శాతం, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27శాతం, పేపర్‌ 2బీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.

అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు

పేపర్‌ 1 - వేమన కుసుమ, కృష్ణా జిల్లా 146 మార్కులు

పేపర్‌ 2ఏ హిందీ - అచ్చుకుట్ల గౌసియా, కడప, 142 మార్కులు

పేపర్‌ 2ఏ సోషల్‌ స్టడీస్‌ - ఆర్ల విష్ణుప్రియ, ఒంగోలు, ప్రకాశం జిల్లా 136 మార్కులు

పేపర్‌ 2ఏ మాథ్స్ అండ్‌ సైన్స్‌ - ఇమంది విజయలక్ష్మి, విజయ నగరం 135 మార్కులు

పేపర్‌ 2ఏ - పాతకోకల బేబీ షాలిని పశ్చిమ గోదావరి, 135 మార్కులు

పేపర్‌ 2ఏ తెలుగు - చింతపల్లి లావణ్య, నెల్లూరు, 134 మార్కులు

పేపర్‌ 2ఏ ఇంగ్లిష్‌ - ఎం ప్రభాకర్‌ బాబు, గుంటూరు 138 మార్కులు

పేపర్‌ 2బీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ - పాముల వేణుగోపాల్‌, చిత్తూరు 135 మార్కులు

పేపర్‌ 2బీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ - షేక్‌ షంషుద్దీన్‌, కృష్ణా, 135 మార్కులు

ఫలితాల కోసం aptet.apcfss.in సైట్‌ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+