జపాన్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ - ఇది చంద్రబాబు స్కూల్..!!
ఇతర రాష్ట్రాల వారు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ పై ఒక విమర్శ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆంధ్రలో జనాలకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని దెప్పుతూ ఉంటారు .. రాజధాని పై గతం లో ఎగతాళి చేసారు .. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అది హైదరాబాదుకో ..బెంగళూరుకో .. చెన్నైకో వెళ్తుంది .. ఏపీ లో ఏముందని.. ఇన్వెస్ట్ చేస్తారులే అని వెటకారం చేసారు .. ఇదంతా గతం .. ఇప్పుడు రూల్ మారింది .. లెక్క మారింది !
ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ ది జపాన్ ఆఫ్ ఇండియా డౌటే లేదు ..నిజమే .. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు... నంబర్స్ చెప్తున్నాయి !ఒకప్పుడు తక్కువ అంచనా వేయబడిన రాష్ట్రం..ఇప్పుడు ప్రపంచం ఇకపై విస్మరించలేని రాష్ట్రంగా అవతరించింది.
- ఆంధ్ర - పెరుగుతున్న పారిశ్రామిక కేంద్రం
- ఆంధ్ర అంటే పెట్టుబడి శక్తి కేంద్రం
- ఆంధ్ర అంటే AI హబ్
- చివరకు .. ఆంధ్ర అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం.
- కేవలం 48 గంటల్లో ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు..
- సుమారు 150 బిలియన్ డాలర్లు
- 613 ఎంఓయూలు , 16.31 లక్షల ఉద్యోగాలు

ఒక పక్క చంద్రబాబు తన వింటేజ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తు చేస్తుంటే .. మరోపక్క నారా లోకేష్ Genz లీడర్ గా దూసుకెళ్ళిపోతున్నారు .లోకేష్ ఈజ్ జస్ట్ బ్రేకింగ్ ది ట్రెడిషనల్ రూల్స్ ..ఉదాహరణకు..కొన్ని రోజుల క్రితం నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది.సెటైరికల్‌గా చెబుతూ .. ఎట్ ది సేమ్ టైం తన పాయింట్ లో ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గకుండా .. తన కామెంట్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి రీచ్ అయ్యేలా ట్రై చేస్తున్నాడు.. ట్రై చేస్తున్నాడు అనే కంటే He is giving his best అనే చెప్పుకోవాలి .
ఆ వారం టీమిండియా ఓడిపోయిందేమో కానీ ..టీం సీబిన్ మాత్రం ఘన విజయం సాధించింది . చరిత్ర సృష్టించింది సీఎం చంద్రబాబు స్పీచ్‌లు ఇవ్వలేదు ...కమిట్‌మెంట్లు డెలివర్ చేశారు!ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రామిస్ చేయలేదు...స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపించారు.ప్రపంచం మొత్తం ఒక్కటే అంటోంది...ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే...ఇక ఆలోచించాల్సిన పని లేదు అని.టేబుల్ మీద పేపర్ పెట్టగానే...సంతకాలు చకా చకా అయిపోయాయి , డబ్బులు క్యూ కట్టాయి!

ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి:
- ఎనర్జీ సెక్టర్‌కి: ₹5.3 లక్షల కోట్లు
- ఇండస్ట్రీస్‌కి: ₹2.88 లక్షల కోట్లు
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి: ₹2 లక్షల కోట్లు
ఒక్కసారిగా అన్ని సెక్టర్లు ఫుల్ ఆన్ ఫైర్.. బీస్ట్ మోడ్ ఆన్ చేసాయి..స్టిల్ ఏపీ సీఎం చంద్రబాబు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్‌తో ...కాల్కులేటెడ్ ప్లాన్‌తో మాంస్టర్ టార్గెట్స్ ఫిక్స్ చేసారు.5 ఏళ్లలో $500 బిలియన్ ఎకానమీ,10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ!ప్రస్తుతం ఏపీ పరిస్థితిని సినిమాటిక్ గా చెప్పాలి అంటే గన్... లోడ్ అయ్యింది,గురి కుదిరింది .. ట్రిగ్గర్ లాగేశారు! శ్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టడమే నెక్స్ట్ మిగిలుంది.
ఓవరాల్ డీల్స్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి ? దాని కథ మీకు తెలియాలి..
2024 జనవరి.చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జోరుగా సాగుతోంది.దక్షిణ కొరియా నుంచి వచ్చిన హ్వాస్యుంగ్ బృందం తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపింది."₹1,720 కోట్లు... 20,000 ఉద్యోగాలు... తూత్తుకుడి లేదా తిరునెల్వేలిలో ఫ్యాక్టరీ" అని హెడ్‌లైన్స్ మారుమోగాయి. అందరూ ఈ ఒప్పందం పక్కా.. తమిళనాడు జాక్ పాట్ కొట్టింది అనుకున్నారు .కానీ... డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది.కట్ చేస్తే ...సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చంద్రబాబు ఒక్కడే కూర్చుని టేబుల్ మీద పేపర్ చదువుతున్నారు . ఆ పేపర్ మీద..హ్వాస్యుంగ్ ఫుట్ వేర్ తమిళనాడు ప్రభుత్వంతో రూ.200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుందని రాసి ఉంది.
సీబీఎన్ వెంటనే ఇండస్ట్రీస్ సెక్రటరీని పిలిచారు.ఈ ప్రాజెక్ట్ మనది కావాలి. ఎలాగైనా మన కుప్పానికి ఇది రావాలి..100 ఎకరాలు భూమి కావాలి .. రేపే సర్వే చేయించండి." అని చంద్రబాబు అల్టిమేటం జారీ చేసారు . మరుసటి రోజు ఉదయం 7 గంటలకి...సియోల్‌లో హ్వాస్యుంగ్ సీఈఓ బాబ్ షోర్రాక్ కి ఫోన్ ."Sir, this is from Andhra Pradesh CMO. We have a special package for you. Can we meet?" అని అడిగారు .అదే వారం... కొరియా టీమ్ మళ్లీ ఇండియాకి వచ్చింది.మొదట చెన్నై వెళ్లారు. తిరునెల్వేలిలో భూమి చూశారు. "ఇంకా క్లియరెన్స్‌లు రాలేదు... 6 నెలలు పడుతుంది" అని అధికారులు చెప్పారు . దీన్నే Due Deligence అంటారు. అక్కడి నుంచి డైరెక్ట్ కుప్పం వెళ్లారు. కలెక్టర్ హెలికాప్టర్ ని ప్లాట్‌లో దింపి, భూమి చూపించారు.100 ఎకరాలు రికార్డు వేగంతో 3 వారాల్లోనే అలాట్‌మెంట్ పూర్తి చేసారు .
కొరియా టీమ్ మెంబర్ ఒక్కడు నమ్మలేక అడిగాడు: "ఇంత తొందరగా ఎలా సార్?" అందుకు కలెక్టర్ బదులిస్తూ.."సీఎం ఆర్డర్ సార్... ఇది కుప్పం." అన్నాడు."ఇన్‌సెంటివ్స్ ఏమైనా కావాలంటే చెప్పండి. మా రాష్ట్రంలో మీ ఫ్యాక్టరీ మొదటి రోజు నుంచి ప్రాఫిట్‌లో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఇస్తాం." అని చంద్రబాబు హామీ ఇచ్చారు
అక్టోబరు లాస్ట్ వీక్... సియోల్‌లో బోర్డ్ రూమ్.బాబ్ షోర్రాక్ ఒక్క మాట చెప్పాడు. తమిళనాడుతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం.. మనం కుప్పంకు వెళుతున్నాం అని చెప్పేశారు.కట్ చేస్తే... నవంబరు 14, విశాఖ సీఐఐ సమ్మిట్.స్టేజ్ మీద చంద్రబాబు .."ఒక రాష్ట్రం MoU చేసుకుంది... కానీ ఫ్యాక్టరీ మన కుప్పంలో పడుతుంది. ఇదే హెల్తీ కాంపిటీషన్." అని చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.
క్వాంటమ్ యుగంలోకి అడుగుపెట్టిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్వాంటమ్ యుగంలోకి అడుగేస్తోంది. జనవరి 2026లో ఇండియాలో మొట్టమొదటి పబ్లిక్ క్వాంటమ్ కంప్యూటర్ డెప్లాయ్‌మెంట్ అవుతుంది.క్వాంటమ్ రిఫరెన్స్ ల్యాబ్స్...క్రయోజెనిక్ కాంపొనెంట్స్ యూనిట్స్...ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్...అన్నీ ఒకే నగరంలో, ఒకే ప్రాజెక్ట్‌లో.ఇది కేవలం టెక్నాలజీ కాదు..గవర్నెన్స్ నుంచి అగ్రికల్చర్ వరకు,
హెల్త్‌కేర్ నుంచి డిఫెన్స్ వరకు-ప్రతి రంగాన్నీ క్వాంటమ్ పవర్‌తో అప్‌గ్రేడ్ చేసే మిషన్.
CII పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా WISER, Qubitech Smart Solutions, QKrishi Quantum సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 50,000 మందికి పైగా స్టూడెంట్స్, రీసెర్చర్స్, ఇంజనీర్లకు క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ అందిస్తూ అమరావతి క్వాంటమ్ వ్యాలీని దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ హబ్‌గా మార్చే కీలక ముందడుగు వేసింది
ఒకప్పుడు జపాన్ రోబోటిక్స్,సెమీకండక్టర్లలో ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించినట్టుగా -ముందు టాలెంట్‌ను తయారుచేయడం,తర్వాత ఇండస్ట్రీని ఆకర్షించడం,చివరికి శాశ్వత ఎకోసిస్టమ్‌ను నిర్మించడం.. అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలో అమలు చేస్తోంది.భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ... అలాగే దేశంలోనే తొలి స్పేస్ సిటీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకుంటున్నాయి.
కర్నూలు ఓర్వకల్‌లో 300 ఎకరాల్లో ఏర్పడుతున్న డ్రోన్ సిటీ..డ్రోన్ మాన్యుఫాక్చరింగ్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద టెస్టింగ్ ఫెసిలిటీ వరకు...డ్రోన్ టాక్సీలు, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్...
దీని ద్వారా 40,000కు పైగా ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.ఇక తిరుపతి-శ్రీ సత్యసాయి జిల్లాల్లో వస్తున్న ట్విన్ స్పేస్ సిటీలు-సాటిలైట్ ప్రోటోటైపింగ్, స్పేస్-టెక్ స్టార్టప్స్, లాంచ్ లాజిస్టిక్స్...దీనివల్ల వచ్చే 10 సంవత్సరాల్లో ₹25,000 కోట్ల పెట్టుబడులు,35,000కు పైగా ఉద్యోగాలు.రాయలసీమను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే ఈ ప్రాజెక్టులు...భారత భవిష్యత్తు ఇక్కడే తయారవుతుందనే దానికి సంకేతం.
ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్ అంటే ఏంటి..?
భారతదేశంలో తొలిసారి... 'ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్' ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది.ఒకసారి MOU సైన్ అయ్యింది అంటే... ఎస్క్రో అకౌంట్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఫండ్లు రియల్‌టైమ్‌లో రిలీజ్ అవుతాయి. ఎవరినీ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు... ఆఫీస్ కారిడార్‌లలో తిరగాల్సిన పని లేదు. అవసరమైతే ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ కూడా ఇస్తుంది.మీరు ఒక పెద్ద కంపెనీ అనుకోండి.ఆంధ్రప్రదేశ్‌లో ₹5,000 కోట్ల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.దానికి ప్రభుత్వం ₹1,000 కోట్ల రాయితీలు (సబ్సిడీలు) ఇస్తానని హామీ ఇస్తోంది.కానీ మీలో సహజంగానే ఒక భయం ఉంటుంది."రేపు ప్రభుత్వం మారితే?""సబ్సిడీలు ఆపేస్తే?"ఇక్కడే 'సావరిన్ గ్యారంటీ' అసలు పవర్‌లోకి వస్తుంది.
అంటే:
- ప్రభుత్వం మారినా ఈ హామీ మారదు
- రాజకీయ నాయకులు మారినా హామీ అలాగే ఉంటుంది
- రాష్ట్రం యొక్క పేరు, గౌరవం, ఆస్తులు-అన్నీ మీ పెట్టుబడికి బ్యాక్‌అప్
ఇది ఒక రాష్ట్రం ఇవ్వగలిగే అత్యంత బలమైన, లీగల్‌గా అన్‌బ్రేకబుల్ గ్యారంటీ.జపాన్,సింగపూర్,దుబాయ్,దక్షిణ కొరియా లాంటి దేశాలు మాత్రమే ఇలాంటి సావరిన్-బ్యాక్డ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఇస్తాయి.ఇప్పుడు భారతదేశంలో మొదటిసారి... ఒక రాష్ట్రం ఇది ఇస్తోంది.అదీ ఆంధ్రప్రదేశ్.అందుకే ఆనంద్ మహీంద్రా లాంటి పెద్దలు చంద్రబాబు విజన్ కి ఫిదా అవుతున్నారు.
ఒకప్పుడు జపాన్ ఆటం బాంబులు పడి బూడిద అయింది.కానీ కేవలం 30 ఏళ్లలోనే తనను తాను మళ్లీ నిలబెట్టుకుంది.టొయోటా కార్లు, సోనీ టీవీలు, పానాసోనిక్ రేడియోలతో గ్లోబల్ మార్కెట్‌ను పూర్తిగా అధిగమించింది.మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో,ఎగుమతుల్లో క్రమశిక్షణతో,టెక్నాలజీలో లీడర్‌షిప్‌తో -ప్రపంచాన్ని మళ్లీ ఆకట్టుకుంది.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే మంత్రాన్ని అనుసరిస్తుంది.కానీ పూర్తిగా కొత్త యుగంలో - AI యుగంలో, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో, గ్రీన్ హైడ్రోజన్ , డేటా సెంటర్స్ , స్పేస్ టెక్నాలజీ మహాయుగంలో..
ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి.ప్రతి ఇంట్లో AI ఉపయోగించాలి.చంద్రబాబు చేస్తున్నది కేవలం రాష్ట్రాన్ని బిల్డ్ చేయడం కాదు...ఆయన ప్రతి ఇంటినీ ఒక చిన్న ఫ్యాక్టరీగా, ఒక చిన్న స్టార్టప్‌గా మారుస్తున్నారు.ఇది స్వర్ణాంధ్ర కాదు...భవిష్యత్ భారతావనికి మొదటి ఇల్లు.ఆంధ్రప్రదేశ్ ఈ పందెం గెలిస్తే...అప్పుడు మనం ఏపీని "ఇండియా జపాన్" అని పొగడటమే కాదు..ఒక రాష్ట్రాన్ని AIతో, క్వాంటమ్ టెక్నాలజీతో, రాజీలేని ఎగ్జిక్యూషన్‌తో ఎలా మళ్లీ నిర్మించాలి? అనే కేస్ స్టడీని భారతదేశమంతా తెలుసుకుంటుంది
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications