విదేశీ మోజు: ప్రియుడితో కలిసి ఆంధ్ర టెక్కీని హత్య చేసిన భార్య

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తంబాళ్ల పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కేశవరెడ్డి (35) హత్య కేసును కర్ణాటక పోలీసులు ఛేదించారు. కేశవ రెడ్డిని హత్య చేసింది స్వయాన అతని భార్య శిల్పారెడ్డి (31) అని పోలీసులు చెప్పారు.

కేశవరెడ్డి, శిల్పా రెడ్డి దంపతులు బెంగళూరు చేరుకుని బాణసవాడిలో నివాసం ఉంటున్నారు. కేశవరెడ్డి ఆక్టీయన్స్ ఇండియా కంపెనీలో సాఫ్టేవేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని కోలారు జిల్లా, శ్రీనివాసపురం తాలుకాలోని బెంగళూరు-మదనపల్లి మార్గం లోని తాడ్ గోళ్ల క్రాస్ దగ్గర చెరువులో శవమై కనిపించాడు.

తరువాత శిల్పా రెడ్డి తన భర్త కేశవరెడ్డి సోదరుడు (మరిది) తిరుమల రెడ్డికి ఫోన్ చేసి మీ అన్న క్షేమంగా ఇంటికి వచ్చాడా అని విచారించింది. ఎప్పుడూ తిరుమలరెడ్డికి ఫోన్ చెయ్యని శిల్పారెడ్డి ఆ రోజు ఫోన్ చెయ్యడంతో అతనికి అనుమానం వచ్చింది.

andhra pradesh Women kills techie husband in Bangalore

మరుసటి రోజు చెరువులో మృతదేహం గుర్తించిన పోలీసులు అక్కడ చిక్కిన కంపెనీ ఐడి కార్డులు, బ్యాగ్ పరిశీలించి హత్యకు గురైయ్యింది కేశవరెడ్డి అని గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుమల రెడ్డి తన వదిన మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు శిల్పారెడ్డి ని విచారణ చేశారు. ఆమె పొంతన లేని విషయం చెప్పింది. శిల్పా రెడ్డి మొబైల్ నెట్ వర్క్ ట్రేస్ చేసిన పోలీసులు శనివారం అర్ద రాత్రి బెంగళూరు-మదనపల్లి మార్గంలో సంచరించిందని గుర్తించారు.

తరువాత పోలీసులు బెండ్ తీస్తే అసలు విషయం చెప్పింది. శిల్పా రెడ్డి ఆమె కజిన్ వాసుదేవతో అక్రమ సంబంధం పెట్టుకునింది. అతని తో కలిసి విదేశాలలో సెటిల్ కావాలని ప్లాన్ వేసింది. తరువాత వాసుదేవకు విషయం చెప్పింది.

శనివారం ఇంటికి వెళ్లిన భర్త కేశవరెడ్డికి గుట్టుచప్పుడు కాకుండ నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. అతను కూల్ డ్రింక్ తాగి మత్తులోకి వెళ్లిన సమయంలో శిల్పారెడ్డి కత్తి తీసుకుని అతనిని దారుణంగా హత్య చేసింది. తరువాత వాసుదేవ సహాయంతో మృతదేహం తీసుకు వెళ్లి చెరువులో విసిరివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+