ఏపీలో 600 దాటేసిన కరోనా కేసులు- ఇవాళ కొత్తగా 31.. గుంటూరులో కొత్త కేసుల్లేవ్..
ఏపీలో కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 603కు చేరుకుంది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
600 దాటిన కరోనా కేసులు..
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 603కు చేరుకుంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానంలో 126 కేసులతో గుంటూరు జిల్లా ఉంది. వారం రోజుల గ్యాప్ లో చూసుకుంటే కరోనా కేసుల సంఖ్య వందకు పైగా పెరగడం అధికార వర్గాలను కలవర పెడుతోంది. అయినా పలు జిల్లాల్లో పరిస్ధితి అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది.

ఏడు జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్...
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటేసినా ప్రభుత్వానికి ఊరట నిచ్చే మరో అంశం కనిపిస్తోంది. మొత్తం 13 జిల్లాలు ఉండగా.. వీటిలో ఏడు జిల్లాల్లో గత 24 గంటలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగే గత రెండు, మూడు రోజులుగా కూడా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు ఐదు నుంచి ఆరు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 24 గంట్లలో ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ఉన్నాయి. వీటిలో మొన్నటి వరకూ అత్యధిక కేసులతో ఉన్న గుంటూరు జిల్లా కూడా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications