లక్ష్మీ పార్వతికి భారీ జలక్ - హోదా ఉపసంహరణ..!!
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. చంద్రబాబు తో విభేదించి వైసీపీకి మద్దతుగా నిలిచిన లక్ష్మీ పార్వతి వ్యవహారంలో అనూహ్య నిర్ణయం జరిగింది. తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ ఆచార్యురాలు హోదాను ఉప సంహరించుకుంటూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ మరణం తరువాత టీడీపీ, లక్ష్మీపార్వతి మధ్య విభేదాలు మొదయ్యాయి. చంద్రబాబును వ్యతిరేకించిన లక్ష్మీ పార్వతి వైసీపీకి దగ్గరయ్యారు. జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు. పలు సందర్భాల్లో చంద్రబాబుపైన తీవ్ర ఆరోపణలు చేసారు. జగన్ ప్రభుత్వ హయాంలో లక్ష్మీ పార్వతికి తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. పలు సందర్భాల్లో చంద్రబాబు అవినీతి పైన లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేసారు.

ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఆంధ్రా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమెకు ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు ప్రకటన చేసారు.
ఇప్పటిదాకా ఆమె ఈ హోదాలో యూనివర్సిటీ నుంచి ఎలాంటి గౌరవ భృతి అందుకోలేదని అన్నారు. ఇప్పుడు ఈమె స్థానంలో మరో రీసెర్చ్ స్కాలర్ ను నియమించబోతున్నామని తెలిపారు. లక్ష్మీ పార్వతి వద్ద మార్గదర్శకం కోసం చేసిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications