షాక్: ప్యాకేజీ ప్రకటించినా లాభం ఎంత? ఇంకెన్నాళ్ళు? ఇలాగైతే ఏపీకి నష్టమే: చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేక హోదాతో కలిగే లబ్దిని ప్యాకేజీలో ఇస్తామన్నారు. కానీ హోదాతో లాభం ఎంతో ఇప్పటిదాకా తేల్చలేదు.2015 ఏప్రిలో తర్వాత కుదిరిన విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టు (ఈఏపీ) రుణభారాన్ని కేంద్రం భరిస్తే మా కష్టం తీరదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈఏపీ ల రుణాన్ని కేంద్రమే చెల్లించాలని ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు.

అమెరికా పర్యటనకు వెళ్ళేమందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుదవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై ఆయన కేంద్ర మంత్రులకు పలు వినతి పత్రాలు సమర్పించారు.

రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్రానికి ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

ప్రత్యేక హోదాతో కలిగే అన్ని కాల ప్రయోజనాలను స్పెషల్ ప్యాకేజీతో ఇస్తామని ఇచ్చిన హమీని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు గతంలో ఇచ్చిన హామీలను ఆయన కేంద్రం వద్ద మరోసారి ప్రస్తావించారు.

ఈఏపీ ల కోసం తీసుకొనే రుణాన్ని కేంద్రమే చెల్లించాలి

ఈఏపీ ల కోసం తీసుకొనే రుణాన్ని కేంద్రమే చెల్లించాలి

ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏపీకి కేంద్రం నుండి అదనంగా వచ్చే 30 శాతం నిధులకు తగ్గట్టుగా ఈఏపీల కోసం తీసుకొనే రుణ మొత్తాన్ని కేంద్రమే గ్రాంట్ గా చెల్లిస్తోందని గతంలో కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..పెండింగ్ లో ఉన్న ఈఏపీలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్యాకేజీపై ప్రకటన చేసి రెండేళ్ళు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే లాభం ఎంత అన్న విషయమై కేంద్ర శాఖలు ఒక అంచనాకు రాలేకపోయాయని బాబు చెప్పారు. మూడు ఈఏపీ ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్ లో పడిపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.3 వేల కోట్ల చొప్పున ఐదేళ్ళకు రూ.15 వేల కోట్లు అదనంగా కావాలని తాము అంచనావేశామన్నారు.. కేంద్ర శాఖల అంచనాలు ఖరారయ్యే వరకు తమ లెక్కల ప్రకారంగా ఈఏపీ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కోరారు.

మూడేళ్ళలో రూ.15 వేల కోట్లు ఈఏపీ ప్రాజెక్టులు రుణాలు పొందేనా?

మూడేళ్ళలో రూ.15 వేల కోట్లు ఈఏపీ ప్రాజెక్టులు రుణాలు పొందేనా?

ఐదేళ్ళకు ప్రకటించిన ప్యాకేజీలు ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. రాబోయే మూడేళ్ళలో రూ.15 వేల కోట్ల మేరకు ఈఏపీ ప్రాజెక్టులకు రుణాలు పొందలేకపోవచ్చు. అందువల్ల 2015 ఏప్రిల్ కు ముందు అవగాహాన కుదుర్చుకొన్న ఈఏపీలకు ఇచ్చిన రుణ భారాన్ని కూడ కేంద్రమే భరించాలని చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు.గతంలో ఏపీకి వర్తించే 3 శాతం ఎప్ఆర్ బి ఎం పరిమితికి లోబడి ఈఏపీ ప్రాజెక్టులకు నిధులు తీసుకొన్నామన్నారు. ఇప్పడు కేంద్రం ఏపీ పాత అప్పుల భారాన్ని మోయగలిగితే మరిన్ని రుణాలను తీసుకొనే వెసులుబాటు కలుగుతోందని చంద్రబాబు జైట్టీకి చెప్పారు.

అలా జరిగితే ఏపీకి నష్టమే

అలా జరిగితే ఏపీకి నష్టమే

ప్రత్యేక ప్యాకేజీలో 2015-16 నుండి 2019-20 వరకు వచ్చే ఈఏపీ రుణాలను మాత్రమే కేంద్రం చెల్లిస్తోందని హామీ ఇచ్చిందని, అలాగైతే ఏపీకి తీరని నష్టం జరుగుతోందని చంద్రబాబునాయుడు వివరించారు. 2015-2020 మధ్య కాలంలో వచ్చిన అన్ని ఈఏపీల రుణభారాన్ని మాత్రమే కాకుండా ఆయా ప్రాజెక్టులకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే చెల్లించాలని చంద్రబాబు కోరారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 2014-15 రెవిన్యూలోటును కేంద్రం ఇంకా భర్తీ చేయలేదన్న విషయాన్ని కూడ జైట్లీ దృష్టికి తెచ్చారు.

కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించింది.అయితే ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనాన్ని ఇంకా తేల్చకపోవడం పట్ల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. 2014-15 రెవిన్యూ లోటును బర్తీ చేయలేదన్నారు. ఆ నిధులను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అమరావతి కోసం అటవీ భూములను వాడుకొంటామని చెప్పారు. ఇళ్ళ నిర్మాణానికి ప్రమాణికింగా పల్స్ సర్వే చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నలుగురు కేంద్రమంత్రులతో బాబు చర్చించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాతో కూడ ఆయన సమావేశమయ్యారు.

ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలి

ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలి

ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుదవారం నాడు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ను బాబు కలిశారు. ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టనున్న ఉపాధి పనులకు లేబర్ బడ్జెట్ లో 1608 లక్షల పనిదినాలను ఆమోదించారని, ఈ మేరకు ఏపీకి రూ.5280 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బకాయిలతో పాటు మొత్తం రూ.5439 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh chiefminister Chandrababunaidu met union financ eminister arun jaitley on Wednesday at New delhi.Chandrababu naidu seeking financial assistance to Andhra pradesh state. union government what is assured to Ap he reminded.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి