ఏపీలో ఆ టీచర్లకు బోధనేతర పనులు అప్పగింత
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది- వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో గల 66 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయడంలో వాలంటీర్లను ఇదివరకే తప్పించిన విషయం తెలిసిందే. సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యతను అప్పగించింది.

తాజాగా- ఆంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లకు సైతం పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యులను చేసింది. వారు కూడా అర్హులైన లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జిల్లాలవారీగా జారీ చేసింది. అంటే- అందుబాటులో ఉన్న సచివాలయ ఉద్యోగులను బట్టి ఆంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లకు ఈ బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది.
జులై 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది ప్రభుత్వం. 30వ తేదీన ఆదివారం సెలవు రోజు కావడం వల్ల ఒక రోజు ముందే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పింఛన్ నగదు మొత్తాన్ని వారు పంచాయతీ కార్యదర్శితో కలిసి డ్రా చేయాల్సి ఉంటుంది.
పింఛన్ మొత్తం 4,000 రూపాయలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపి చెల్లిస్తుంది. మొత్తం కలిపి 7,000 రూపాయలను అర్హులైన లబ్దిదారులకు చెల్లించాల్సి ఉండగా.. ఈ మొత్తాన్ని 6,000 రూపాయలకు కుదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనికి సంబంధించిన స్లిప్పులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ స్లిప్పుల్లో పింఛన్ నగదు మొత్తం వేర్వేరుగా ఉండటం కనిపించింది. కొందరికి 7,000 రూపాయలు, మరికొందరికి 6,000 రూపాయలను చెల్లించేలా ఇందులో పొందుపరిచారు. ఈ తేడా ఎందుకు వచ్చిందనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications