పవర్ ప్లాన్: చంద్రబాబుతో అనిల్ అంబానీ, టికి దేవినేని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సోమవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడంపై వారు చర్చించారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఇండియన్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనీల్ అంబానీతో పాటు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో ప్రతినిధులు పాల్గొన్నారు.

అనవసర వివాదాలు సృష్టించి.. : దేవినేని ఉమ

అనవసర వివాదాలు రేపి జాతీయ జల సంఘం చేతికి అధికారం ఇవ్వవద్దని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. జల సమస్యను రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా జాతీయ జలసంఘం చేతికి ఇస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయన్నారు.

Anil Ambani meets Chandrababu

కృష్ణా బేసిన్ లో 10 లక్షల ఎకరాలకు పైబడి వరి నాట్లు పడాల్సి ఉండగా, కేవలం 150 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయంటే అది కూడా బోర్ల కిందే సాగు కావడం వల్లే అన్నారు. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవాలన్నారు. వర్షాలు పడకపోతే తాగునీటికి ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నామన్నారు.

యనమల ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ

అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటైన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ సోమవారం ఉదయం భేటీ అయింది. మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె, కామినేని ఈ సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+