నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు నమ్మకద్రోహం చేస్తే జరిగేదిదే.. 24గంటలు టైమిచ్చి కోటంరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్!!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయనకు రాజీనామా సవాల్ విసిరి 24 గంటల సమయం ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ తో ప్రతిపక్ష నేతల దృష్టి కూడా ఒకసారి వైసీపీలో అసంతృప్తులపై మళ్లేలా చేస్తుంది . నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి, తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని బాహాటంగా విమర్శలు చేయడంతో వైసిపి నేతలు దానిని తిప్పికొడుతున్నారు.

చంద్రబాబు, లోకేష్ లతో టచ్ లోకి వెళ్లిన కోటంరెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్

ఇక తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని నిరూపిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ నిలదీశారు.

ఇక ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్న ఆడియో సంభాషణను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి తన సవాల్ ను స్వీకరించాలంటూ పేర్కొన్నారు.

24 గంటల సమయం ఇస్తున్నా .. నిరూపించు

24 గంటల సమయం ఇస్తున్నా .. నిరూపించు


కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్న ఆడియో సంభాషణలను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలు తీసుకొని స్పీకర్ దగ్గరకు రావాలని సవాల్ చేశారు. తాను కూడా రాజీనామాతో వస్తానని.. పేర్కొన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాను చేసిన సవాల్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు.

15 సెకండ్ల ఆడియో రిలీజ్ చేయడం కాదు.. మొత్తం 51 సెకండ్ల ఆడియోను విడుదల చేయాలని అది రాష్ట్ర ప్రజలందరూ వింటారని, అందులో కోటంరెడ్డి ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుస్తుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

టీడీపీలోకి వెళ్ళటానికి అంతా సిద్ధం చేసుకుని ఆరోపణలు

టీడీపీలోకి వెళ్ళటానికి అంతా సిద్ధం చేసుకుని ఆరోపణలు

జగన్ కు నమ్మకద్రోహం చేస్తే ఆ పాపం పిల్లలకు కొడుతుందంటూ వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైయస్ జగన్ అవకాశం ఇస్తేనే నువ్వైనా, నేనైనా ఎమ్మెల్యే అయ్యామంటూ స్పష్టం చేశారు. జగన్ అనే వ్యక్తి లేకపోతే మన పక్కన 70, 80 వేల ఓట్లు ఉండవు అని, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

తాను ఎప్పుడైనా రాజీనామాకు రెడీ అని పేర్కొన్న అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుని జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదని కోటంరెడ్డిపై మండిపడ్డారు.

ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము.. అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా

ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము.. అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా

జనవరి 27వ తేదీన కోటంరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ టిడిపి ఖరారు చేసిందని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇక పార్టీని వీడే సమయం వచ్చింది కాబట్టి కోటంరెడ్డి కావాలని ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సరికాదని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. ఇక ఆనం రామనారాయణరెడ్డి చచ్చిన పాము అని ఆయన ప్రాణాలకు ఎవరు హాని కలిగిస్తారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆనం రామనారాయణ రెడ్డిని ఎద్దేవా చేశారు.

English summary
Ex-minister Anil Kumar Yadav salms kotamreddy sridhar reddy and challenged him to prove in 24-hours on the tapping of Kotam Reddy Sridhar Reddy's phone. If he proves anil said that he will resign, otherwise kotamreddy to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X