బాలకృష్ణా! నీకు పిచ్చే కదా! సర్టిఫికేట్ కూడా ఉందిగా: జగన్ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

అమరావతి/నెల్లూరు: ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ విమర్శలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిచ్చి సర్టిఫికేట్‌తో..

పిచ్చి సర్టిఫికేట్‌తో..

శనివారం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ గారూ!, అయ్యా, నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడుతున్నావు! నీకు పిచ్చి ఉందనే సర్టిఫికెట్‌తో కేసులో నుంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా?' అని ఆయన ప్రశ్నించారు.

ముంబై ఆస్పత్రిలో..

ముంబై ఆస్పత్రిలో..

అంతేగాక, ‘నాకు(బాలకృష్ణ) పిచ్చి ఉంది, మతి స్థిమితం లేదు.. మానసిక పరిస్థితి సరిగా లేదు' అని చెప్పి ముంబైలోని ఓ ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకుని ఒక కేసులో నుంచి నువ్వు తప్పించుకున్నావు.. నిజం కాదా?' అని అనిల్ కుమార్ నిలదీశారు.

జగన్‌కు శిక్ష తప్పదు, వైయస్ లాగే..: పాస్టర్ తీవ్ర వ్యాఖ్యలు

పారిపోయావు.. నీలా కాదు.. జగన్ పులిబిడ్డ

పారిపోయావు.. నీలా కాదు.. జగన్ పులిబిడ్డ

‘మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన మీ బావ వెంట పారిపోయిన నువ్వు.. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటు. ఒక మహనీయుడికి ఎలాంటి కొడుకులు పుట్టకూడదనే దానికి నిదర్శనం మీరు అయితే, పులి కడుపున పులే పుడతాడని చెప్పడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి' అని అనిల్ వ్యాఖ్యానించారు.

ఐనా బుద్ధిరాలేదు: జగన్‌పై బాలయ్య పరోక్ష విమర్శలు, బాబుకు ప్రశంసలు

కొట్టకపోతే వింత..

కొట్టకపోతే వింత..

ఇంకా, ‘బాలకృష్ణ ఏదైనా మీటింగ్ కు వెళితే ఎవరినీ కొట్టకపోతే వింతగా వుంటుంది. అటువంటి నువ్వు ప్రజల గురించి మాట్లాడటం, జగన్‌ని ‌ విమర్శించడం సిగ్గుచేటు' అని అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసినా బుద్ధి రావడం లేదని బాలకృష్ణ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Anil Kumar Yadav on Saturday lashed out at TDP MLA and Cine Actor Nandamuri Balakrishna.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి