వెంకన్న ఆలయంలో అనిల్ ప్రమాణం - లోకేష్, సోమిరెడ్డికి సవాల్..!!
టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణల పైన మాజీ మంత్రి అనిల్ సీరియస్ అయ్యారు. తాను ఎటువంటి అక్రమాలు చేయలేదని వెంకన్న దేవాలయంలో ప్రమాణం చేసారు. తన మీద చేసిన ఆరోపణలు నిజమైతే ప్రమాణం చేయాలని లోకేశ్ ను సవాల్ చేసారు. తాను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. లోకేష్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి ప్రమాణం చేస్తారా అని నిలదీశారు.
నెల్లూరు జిల్లాలో యువగళం యాత్ర కొనసాగిస్తున్న లోకేశ్ మాజీ మంత్రి అనిల్ ను టార్గెట్ చేసారు. అనిల్ అక్రమాస్తులు..ఆక్రమణలు అంటూ ఆరోపణలు చేసారు. దీని పైన అనిల్ క్లారిటీ ఇచ్చారు. తన ఆస్తులు..అప్పుల వివరాలను వెల్లడించారు. తాను వంద కోట్ల ఆస్తి కోల్పోయానని వివరించారు. ఇప్పటికీ రూ 3 కోట్ల అప్పుల్లో ఉన్నానని వెల్లడించారు. తాను ఏ తప్పు చేయలేదని దేవుడి మందు ప్రమాణానికి సిద్దమని సవాల్ చేసారు. లోకేశ్ కూడా రావాలని ఛాలెంజ్ విసిరారు. ఈ రోజు వెంకటేశ్వరపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో ప్రమాణం చేశారు. ఎదుటి వారికి సహాయం చేశాను కానీ అక్రమాస్తులు కూడబెట్టలేదన్నారు.

మరో వైపీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన పైన లోకేశ్ చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని చేసిన ఆరోపణల పై సీఎం ను కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరుతానని వెల్లడించారు. తమాది జమీందార్ల కుటుంబం..ఆ రోజుల్లో మాకు 16 వేల ఎకరాల భూమి ఉండేదని వివరించారు. ఎన్టీఆర్ మా కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చేవారన్నారు. తన తండ్రికి ఎన్టీఆర్ తన కేబినెట్‌లో చోటు కల్పించారని గుర్తు చేసారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్‌కు చాడీలు చెప్పించి మంత్రివర్గం నుంచి తీయించారని వివరించారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీలో ఎన్టీఆర్ అభిమానులందరినీ పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. తన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications