రోజాకు తమిళనాడు పార్టీ మద్దతు, ఆంధ్రాలో దిక్కులేదు కాని పది మంది వస్తే సరిపోతుందా ?
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎవరికి వస్తాయని జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏ సీట్లలో కచ్చితంగా ఓడిపోతామో అని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు తెలిసినా అక్కడ పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
అలాంటి నియోజక వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆరోకే. రోజా పోటీ చేస్తున్న నగిరి నియోజక వర్గం కూడా ఒక్కటి. నగరిలో ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి రోజా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోజా తీరుతో విసిగిపోయిన వైసీపీ నాయకులు ఆమె సహవాసం మాకువద్దురా దేవుడా అంటూ దూరం వెళ్లిపోయారు. రోజాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకూడదని నగిరి వైసీపీ నాయకులు సీఎం వైఎస్ జగన్ తో పాటు సజ్జల రామక్రిష్ణా రెడ్డికి మనవి చేశారు.

సీటు రాకుండా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజా మాత్రం నగిరి ఎమ్మెల్యే సీటు తెచ్చుకుని పంతం నెగ్గించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టిక్కెట్ వచ్చినా క్యాడర్ లేకపోతే ఎవ్వరూ ఏమి చెయ్యలేరని తెలిసినా రోజా మాత్రం అందుకు భిన్నంగా మొండిపట్టుదలతో ఎన్నికల ప్రచారం చేస్తూ తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, మీ రుణం తీర్చుకోవడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని నగిరి నియోజక వర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాలలోని వైసీపీ కీలకనేతలు రోజాకు దూరం అయ్యారు. ఈ ఎన్నికలకు మాత్రం మేము పని చెయ్యలేమని, అయితే మేము వైసీపీలోనే ఉంటామని ఆ నాయకులు తేల్చి చెప్పారు. తన వెంట ఎవరు వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను అంటూ రోజా ఆ నాయకులతో రాజీకావడానికి కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదని తెలిసింది. కొందరు నాయకులు దూరం కావడంతో ఆ వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కూడా రోజాకు దూరంగా ఉంటున్నారు.
ఇలాంటి సమయంలో రోజా కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. సెంగుంధర్ల కులం నాయకులు కొందరు మంత్రి రోజాను కలిసి మద్దతు ప్రకటించారు. సెంగుంధర్లు సంక్షేమం కోసం తమిళనాడులో స్థాపించిన అన్నామక్కల్ పార్టీకి చెందిన కొందరు నాయకులు నగిరి చేరుకుని రోజా కార్యాలయానికి వెళ్లి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆ కుల సంఘం నాయకుడు కన్నాయిరం మాట్లాడుతూ మంత్రి రోజా మమ్మల్ని చాలా ఆదుకున్నారని చెప్పారు.

కరోనా సమయంలో రోజా సెంగంధుర్లను అన్ని విధాలుగా ఆదుకున్న విషయం తాము మరిచిపోలేమని అన్నారు. మాకు ఆర్డర్లు లేక అవస్తలు పడుతున్న సమయంలో స్కూల్ యూనీఫామ్ ఆర్డర్లు మాకు ఇప్పించిన రోజా మమ్మల్ని ఆదుకున్నారని కన్నాయిరం చెప్పారు. మా కుల వాళ్లు చేనేతా కార్మికులు అని, మాకు రోజా అందించిన సహకారం మరువలేమని, ఈ ఎన్నికల్లో రోజాకు మేము అండగా ఉంటామని కన్నాయిరం చెప్పారు.
ఈ సందర్బంలో మంత్రి రోజా కూడా ఆమె మద్దతు ఇచ్చిన వారిని గౌరవించారు. తన భర్త ఆర్ కే సెల్వమణి కూడా సెంగుంధర్లకులానికి చెందినవాడే అని, తాను సెంగుంధర్ల ఇంటి కోడలు అని అన్నారు. సెంగుంధర్లకు తాను అన్ని విదాలుగా సహకరిస్తానని, వారు తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని మంత్రి రోజా అన్నారు. అయితే పక్కలో ఉండే తమిళనాడుకు చెందిన ఓ చిన్న పార్టీకి చెందిన పది మంది నాయకులు ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇస్తే సరిపోతుందా, ఇక్కడ ఉన్న వాళ్లు మీకు ఓట్లు వెయ్యాలని కదా ? అంటూ ప్రతిపక్ష పార్టీలు రోజా మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications