వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేశ్ కే పార్టీ బాధ్య‌త‌లు..అందుకే నేత‌లంతా: చిన‌బాబుకు సిగ్గు ఉంటే..: టీడీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌నం..

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి నుండి టీడీపీ నేత‌లు అనేక మంది లోకేశ్ ను ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తొలుత పార్టీని వీడిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు సైతం చంద్ర‌బాబు వ‌ద్ద లోకేశ్‌తో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేసా రు. ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన కాపు నేత‌లు లోకేశ్ కార‌ణంగానే పార్టీ వీడింద‌ని ఆరోపించారు. ఇక‌, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం లోకేశ్ కార‌ణంగానే పార్టీ ఓడిపోయింద‌ని..దొడ్డి దారిన మంత్రి అయిన లోకేశ్ ద‌మ్ముంటే రాజీనామా చేయాల‌ని స‌వాల్ చేసారు. ఇప్పుడు లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ పైన కొత్త చ‌ర్చ మొద‌లైంది.

లోకేశ్ ల‌క్ష్యంగా నేత‌ల విమ‌ర్శ‌లు..

లోకేశ్ ల‌క్ష్యంగా నేత‌ల విమ‌ర్శ‌లు..

ఎన్నిక‌ల్లో ఓట‌మితో టీడీపీ కీల‌క నేత‌లు వ‌రుస‌గా పార్టీని వీడుతున్నారు. ఇదే స‌మ‌యంలో వారు లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మికి లోకేశ్ కార‌ణ‌మంటూ నిందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని వీడే స‌మ‌యంలో లోకేశ్ కార‌ణంగా పార్టీలో నేత‌లు ఇబ్బంది ప‌డుతు న్నార‌ని..లోకేశ్‌తో రాజీనామా చేయించాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబును కోరారు. ఆయ‌న స‌సేమిరా అన్నారు. దీంతో వారు పార్టీని వీడారు. అదే విధంగా కాకినాడ‌లో ప్రత్యేకంగా స‌మావేశ‌మై..ఆ త‌రువాత చంద్ర‌బాబుతో భేటీ అయిన కాపు నేత‌లు సైతం లోకేశ్ మీద‌నే ఫిర్యాదులు చేసారు. అయితే, చంద్ర‌బాబు పార్టీ మొత్తం త‌న కంట్రోల్ లోనే ఉంద‌ని.. తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం అవే ఆరోప‌ణ‌లు చేసారు. టీడీపీని లోకేశ్ చేతుల్లో పెట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు

లోకేశ్ కు ద‌మ్ముంటే రాజీనామా చేయాలి..

లోకేశ్ కు ద‌మ్ముంటే రాజీనామా చేయాలి..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి లోకేష్‌ వ్యవహారమే కారణమని పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ఆరోపించారు. కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్‌ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. లోకేశ్ త‌న మీద గెలిచిన ఆర్కేతో క‌లిసి చ‌ట్ట స‌భ‌ల్లో కూర్చోవ టానికి సిగ్గుండాలి అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. లోకేశ్ కు ద‌మ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్‌ సవాల్‌ విసిరారు. లోకేష్‌ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్‌ సంస్థలా పార్టీ తయారైందని స‌తీష్ ఫైర్ అయ్యారు.

మ‌రికొంత మంది రాజీనామాకు సిద్దం..

మ‌రికొంత మంది రాజీనామాకు సిద్దం..

స‌తీష్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి..టీడీపీకి రాజీనామా చేసారు. ఆయ‌న అధికారికంగా ఏ పార్టీలో చేరేది స్ప‌ష్టం చేయ‌క‌పోయి నా..బీజేపీలో చేరే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. స‌తీష్ పార్టీకి రాజీనామా చేసిన త‌రువాత లోకేశ్ ను టార్గెట్ చేస్తూ ..
న్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇప్పుడు వ‌రుస‌గా పార్టీ నేత‌లు లోకేశ్ ను ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తుండంతో పార్టీలో లోకేవ్ భ‌విత‌వ్యం పైన అనుమానాలు మొద‌ల‌య్యాయి. ముందుగా చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను ఎలా స‌మాధాన ప‌రుస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. లోకేశ్ వీటి మీద మాత్రం ఎక్క‌డా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

English summary
TDP MLC Annam Satish Prabhakar serious comments on Lokesh. He demanded Resignation for party defeat in last elections. Satish resigned for MLC and also for TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X