ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ- ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో, ఇక..!!

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్మాణాలు వేగవంతం చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా వారికి అందిస్తున్న ప్రోత్సాహకాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతున్న సమయంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణమాలకు ఆమోద ముద్ర వేసారు. ఇదే సమయంలో.. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.

అమరావతి లో రైతులు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. రెండో విడత భూ సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా రైతులకు పలు హామీలు ఇచ్చింది. కౌలు పెంపుతో పాటుగా లక్షన్నార వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసింది. తాజాగా.. వారికి కౌలు పెంచుతూ.. పూర్తి వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక కౌలు పెంపుతో పాటుగా.. ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే గ్రాంట్‌లు పెంచడంతో పాటు రెండో విడత భూసమీకరణకు ముందుకొచ్చిన రైతులకు రుణమాఫీ చేసేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో రుణమాఫీ అమలు చేయడానికి మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

 విశాఖ కేంద్రంగా జగన్ బిగ్ డెసిషన్ - మావిగన్ ప్రకటనతో..!!
విశాఖ కేంద్రంగా జగన్ బిగ్ డెసిషన్ - మావిగన్ ప్రకటనతో..!!
ap-govt-key-decision-over-incentives-hike-for-amaravati-farmers-as-latest-discussions-orders-issue

ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

తాజా ఉత్తర్వుల మేరకు 2024 జూన్‌ 12 లేదా ఆ తర్వాత డీడ్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ (ఫాం 9.14) అమలు చేసిన రాజధానిలోని భూ యజమానులకు పదేళ్ల కాలానికి చెల్లించే వార్షిక కౌలును మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000 నుంచి రూ.40,000కు, జరీబు భూములకు ఎకరానికి రూ.60,000 పెంచారు. 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12నెలలకు చెల్లించే గ్రాంట్‌ను (అద్దె కల్పనతో సహా) నెలకు రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అదే విధంగా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ పరిధిలోకి వచ్చే రైతులకు లక్షన్నార వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందు కోసం ఏపీసీఆర్డీఏ చట్టం- 2014లోని సెక్షన్‌ 55(4) కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్‌ తేదీ అయిన 2026 జూన్‌ 1ని కటాఫ్‌ తేదీగా స్వీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌ను అనుమతిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. దీని ద్వారా.. అమరావతి రైతులకు ఆర్దికంగా మరింత ప్రయోజనకరంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+