Viral Video: శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. ఆటో నడుపుతున్న కాక్రోచ్ బాస్ దిప్కే ..!

కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు, ఎస్ఐఆర్ తో దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగింపుపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇవాళ ముంబైలో భారీ పోరు ప్రారంభించబోతోంది. ఇప్పటికే సీఈసీ రాజీనామాకు సీజేపీ విధించిన 48 గంటల డెడ్ లైన్ గత నెలలోనే ముగిసింది. దీంతో ఇవాళ గాంధీ జయంతి వేళ ముంబై శివాజీ పార్క్ వద్ద ఆందోళనలకు కాక్రోచ్ లు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) చేసిన ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది.

ముంబై పోరుకు సిద్దమైన కాక్రోచ్ లు..! సీఈసీ రాజీనామాపై తాడోపేడో..!
ముంబై పోరుకు సిద్దమైన కాక్రోచ్ లు..! సీఈసీ రాజీనామాపై తాడోపేడో..!

ముంబై శివాజీ పార్క్ వద్ద ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాక్రోచ్ జనతా పార్టీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఆందోళనలు ప్రారంభించనుంది. దీనికి ముందు ముంబైకి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. వారితో కలిసి శివాజీ పార్క్.. శివాజీ పార్క్ అంటూ ఓ ఆటోవాలా తరహాలో సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కే ఓ వీడియో చేశారు. ఇందులో శివాజీ పార్క్ కు వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తితో కలిసి అభిజీత్.. శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. సాయంత్రం 4 గంటలకు అంటూ సాధారణ ఆటో వాలా తరహాలో పిలుస్తూ ఈ వీడియో చేశారు. ఈ వీడియోలో దిప్కేతో పాటు ఆ వ్యక్తి కూడా అలాగే శివాజీ పార్క్.. శివాజీ పార్క్ అంటూ జత కలిశాడు.

Viral Video CJP Chief Abhijeet Dipke Takes Auto to Shivaji Park Ahead of Mumbai Protest

ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!
ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!

ఇవాళ శివాజీ పార్క్ వద్ద కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళనలను ఎలాగైనా అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులొడ్డుతోంది. ఇందులో భాగంగా శివాజీ పార్క్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలతో ఇక్కడ వద్దంటూ పోటీ ఆందోళనలకు చేయిస్తోంది. ఇదే కారణాన్ని చూపుతూ శివాజీ పార్క్ కు కాక్రోచ్ లు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కేను సైతం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినా సీఈసీ రాజీనామా చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని కాక్రోచ్ లు చెప్తున్నారు. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనల సందర్భంగా తలెత్తిన పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్ లో కాక్రోచ్ లు ఆందోళన ప్రారంభిస్తారా లేక పోలీసులు వారిని అడ్డుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+