వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులపై నిఘా.. చిన్న కాఫీ బ్రేక్‌తో పెద్ద రచ్చ!

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులపై కంపెనీలు ఎంతలా నిఘా పెడుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆఫీసు వర్క్ లో భాగంగా చాటింగ్ యాప్‌లో స్టేటస్ కొద్దిసేపు 'అవే' (Away) గా మారితే చాలు.. మేనేజర్లు వెంటనే కన్నెర్రజేస్తున్నారు. తాజాగా ఒక ఉద్యోగి కేవలం నాలుగు నిమిషాల పాటు కాఫీ తెచ్చుకోవడానికి వెళ్లగా, అతని మేనేజర్ పంపిన మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఇప్పుడు కార్పొరేట్ లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది.

ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2:14 నిమిషాలకు అతని స్లాక్ (Slack) స్టేటస్ 'అవే'లోకి మారింది. సరిగ్గా నాలుగు నిమిషాల తర్వాత, అంటే 2:18 నిమిషాలకే మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది. "మీరు వర్కింగ్ అవర్స్‌లో ఇలా దూరంగా ఉంటే ఎలా? ఆఫీస్ వేళల్లో ఎటైనా వెళ్తే ముందుగా 'అవుట్ ఆఫ్ ఆఫీస్' నోటిఫికేషన్ పెట్టండి" అంటూ మేనేజర్ ఆ ఉద్యోగిని ప్రశ్నించారు. ఈ స్క్రీన్‌షాట్‌‌ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు.

Four-Minute Coffee Break Leads To Manager Warning For Remote Worker Reshaping Workplace Surveillance Debate
ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్- వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోం..!
ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్- వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోం..!

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు.. ఆఫీసు కల్చర్‌పై వాదనలు

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఒక వర్గం వారు మేనేజర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. "అసలు ఆఫీసుల్లో ఉంటే ఉద్యోగులు బాత్‌రూమ్‌లకు వెళ్లడం, కాఫీ త్రాగడం, తోటివారితో ముచ్చటించడం వంటివి రోజూ చేస్తుంటారు కదా! అలాంటప్పుడు ఇంటి నుంచి పనిచేసేటప్పుడు నాలుగు నిమిషాల బ్రేక్‌కు కూడా లెక్కలు తీయడం దారుణం" అని మండిపడ్డారు.

WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ? 70 దేశాల బాటలో భారత్..!
WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ? 70 దేశాల బాటలో భారత్..!

మేనేజర్ వైపు సమర్థనలు కూడా..

మరోవైపు, కొంతమంది మాత్రం మేనేజర్ చర్యను సమర్థించారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టకపోతే ఉద్యోగులు సమయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని, పెద్ద తప్పులు జరగకుండా నివారించడానికి ఇలాంటి పర్యవేక్షణ కూడా అవసరమేనని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల స్వేచ్ఛ, మేనేజర్ల కఠిన నిబంధనల మధ్య జరుగుతున్న ఈ రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+