నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ ఎమోషనల్ స్పీచ్

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టులకు అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా ఘనంగా అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్', 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

వీరితో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. సభా వేదికపై మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం, 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్' పై ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు.

Anant Ambani Calls Himself Andhra Son As Reliance Partners For Agricultural Revolution In AP

రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్

సుమారు రూ. 1 లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు కానున్న 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' ద్వారా వ్యవసాయం - ఉద్యానవన రంగాలు అత్యంత లాభసాటిగా మారనున్నాయి. రాష్ట్రంలోని రైతన్నలకు ఆధునిక సాంకేతిక సేవలను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళికకు రూపకల్పన చేశారు.

ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!
ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!

"నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి" - అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం

ఈ శంకుస్థాపన సభలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చేసిన ప్రసంగం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. "నన్ను మీలో ఒకడిగా, ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి నేను ఏవిధంగా సేవ చేయాలో మార్గదర్శనం చేయండి" అంటూ ఆయన సీఎం చంద్రబాబును కోరారు. అనంత్ అంబానీ ప్రసంగం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనను అభినందించగా, సీఎం చంద్రబాబు అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. రాయలసీమ హార్టికల్చర్ హబ్ దేశాభివృద్ధిలో కీలక మైలురాయిగా మారుతుందని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' కూడా భవిష్యత్తులో అత్యున్నతంగా ఎదుగుతుందని, ఇది అన్నదాతలను తమ కమతాలకే సీఈఓలుగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

53 ఏళ్ల ఏనుగు విమానమెక్కిన వేళ.. దేశ చరిత్రలోనే తొలిసారి
53 ఏళ్ల ఏనుగు విమానమెక్కిన వేళ.. దేశ చరిత్రలోనే తొలిసారి

సాంకేతికత జోడింపు.. రైతులకు జియో, రిలయన్స్ భరోసా

భారత ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న 'వికసిత్ భారత్' స్వప్నాన్ని దేశ యువత అంతా కలిసి సాకారం చేస్తామని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ సర్వోదయ, అంత్యోదయ స్ఫూర్తితో పాటు.. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదాల కలయికతో ISA పనిచేస్తుందని తెలిపారు.

పంటలకు చీడపీడలు సోకకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, రోబోటిక్స్ సాంకేతికతను జోడించి ప్రెసిషన్ ఫార్మింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీనివల్ల నీరు, ఎరువుల వినియోగం మెరుగై రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. మదనపల్లె టమాటో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ, ఎప్పుడు విక్రపించాలో సలహాలు అందించేలా సహకరిస్తామని తెలిపారు. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా రైతులను కేవలం అన్నదాతలుగానే కాకుండా 'ఉర్జా దాతలు'గా మారుస్తామని, స్వచ్ఛమైన ఇంధనం కోసం రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో కలిసి 'జియో' సంస్థ పని చేస్తుందని, 'కియో కృషి' ద్వారా రైతుల ఇంటి ముంగిటకే సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. జామ్‌నగర్‌లో బయో ఎనర్జీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

పశు సంవర్ధకం, వంతారా సేవల విస్తరణ

దేశ్ సేవా - కిసాన్ సేవా అన్నదే తమ నినాదమని పేర్కొన్న అనంత్ అంబానీ.. 'పశు సేవా హీ ప్రభు సేవా' అని తాను గట్టిగా నమ్ముతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదను పెంచేందుకు హైటెక్ యానిమల్ హజ్బెండ్రీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 'వంతారా' ద్వారా జంతువులకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, యువతకు ఉపాధి కల్పించేలా వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాలను అభివృద్ధి చేయడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం ద్వారా భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అనంత్ అంబానీ ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 14 లక్షల కోట్ల పెట్టుబడులు, 388 మెగా ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా 11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం అభినందనీయమన్నారు. గ్రామీణ వాణిజ్యానికి, సుస్థిర గ్రామాలకు మదనపల్లె వేదికగా ఇవాళ పటిష్టమైన పునాది పడిందని, ఈ ప్రయాణంలో రిలయన్స్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+