శివాజీ పార్క్ ధర్నాకు పర్మిషన్ ఉందా ? 13 కోట్ల ఓట్లు తీయడానికి ఉందా ?-కాక్రోచ్ కౌంటర్..!

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ (SIR)ను అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను కూడా పట్టించుకోకపోవడం ఆయన మెడకు చుట్టుకుంటోంది. దీంతో సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ముంబై శివాజీ పార్క్ వద్ద భారీ ధర్నాకు సిద్దమవుతోంది.

ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!
ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!

అయితే ముంబై శివాజీ పార్క్ వద్ద ధర్నాకు కాక్రోచ్ జనతా పార్టీ ముందస్తు అనుమతి తీసుకోలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత అశుతోష్ రాంకా స్పందించారు. శివాజీ పార్క్ ధర్నాకు ముందస్తు పర్మిషన్ తీసుకున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను జాబితాల నుంచి తీసేసేందుకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎవరి పర్మిషన్ తీసుకున్నారని ఆయన ఎదురు ప్రశ్నించారు. సీఈసీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించారని ఆయన ఆక్షేపించారు.

CJP Hits Back Over Shivaji Park Protest Permission Who Gave CEC Permission to Remove 13 Crore Voters
Viral Video: శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. ఆటో నడుపుతున్న కాక్రోచ్ బాస్ దిప్కే ..!
Viral Video: శివాజీ పార్క్.. శివాజీ పార్క్.. ఆటో నడుపుతున్న కాక్రోచ్ బాస్ దిప్కే ..!

ముంబై శివాజీ పార్క్ వద్ద సీఈసీ రాజీనామా డిమాండ్ తో గాంధీ జయంతి రోజు ధర్నా చేస్తామని ముందుగానే అనుమతి కోరినట్లు సీజేపీ నేత అశుతోష్ రాంకా తెలిపారు. అయితే అనుమతులు ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తాము ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పేశారు. ఇప్పటికే ముంబై పోలీసులు కాక్రోచ్ ల ధర్నాకు అనుమతి నిరాకరించడంతో పాటు ఆ వైపుగా ఎవరూ వెళ్లకుండా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయినా కాక్రోచ్ లు అనుకున్న సమయానికి ధర్నా ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీంతో ఇవాళ ముంబైలో తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ముంబై నగరానికి చేరుకున్న కాక్రోచ్ లు సాయంత్రం 4 గంటలకు ఈ ధర్నా ప్రారంభించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+