అమరావతిలో డొక్కా చిచ్చు ? తాడికొండ ఇన్ ఛార్జ్ గా ఎంట్రీ- సుచరితే కారణమంటూ శ్రీదేవి పోరు

ఏపీ రాజధాని అమరావతిలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వీచిన ఫ్యాన్ గాలిలో అమరావతిలోనూ వైసీపీ ప్రభావం కనిపించింది. ఇక్కడ కీలకమైన మంగళగిరి, తాడికొండ సీట్లను వైసీపీ దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. మంగళగిరి వైసీపీలో గ్రూపు రాజకీయాలు కనిపిస్తుండగా.. తాడికొండలోనూ అదే సీన్ దర్శనమిస్తోంది. దీనికి కారణం జగన్ తీసుకున్న తాజా నిర్ణయమే. దీని ప్రభావం గుంటూరు వరకూ కనిపిస్తోంది.

 తాడికొండలో డొక్కా ఎంట్రీ

తాడికొండలో డొక్కా ఎంట్రీ

అమరావతిలో కీలకమైన తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. అయితే ఆమె పనితీరుపై అసంతృప్తిగా ఉన్న పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. దీంతో శ్రీదేవి స్ధానంలో గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేను కాదని ఇక్కడ అదనపు ఇన్ ఛార్జ్ గా డొక్కాను ప్రకటించింది. ఇది తాడికొండలో కొత్త పోరుకు కారణమవుతోంది.

ఎమ్మెల్సీ నుంచి విప్ గా డొక్కాకు ప్రమోషన్

ఎమ్మెల్సీ నుంచి విప్ గా డొక్కాకు ప్రమోషన్

అంతటితో ఆగకుండా మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ కు వైసీపీ అధిష్టానం.. తాజాగా ప్రోటోకాల్ కలిగిన పదవి విప్ గా కూడా నియమించింది. దీంతో డొక్కాపై వైసీపీ ఇక్కడ ఎంత నమ్మకం ఉంచిందో అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి డొక్కాను తాడికొండ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించడం వల్లే ఆయన్ను వరుసగా ప్రమోట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పటి వరకూ తాడికొండ వైసీపీలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన శ్రీదేవికి చెక్ పెట్టినట్లు అయింది.

శ్రీదేవి వర్సెస్ డొక్కా పోరుకు శ్రీకారం

శ్రీదేవి వర్సెస్ డొక్కా పోరుకు శ్రీకారం

తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యే ఉండగానే అదనపు ఇన్ ఛార్జ్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై ఉండవల్లి శ్రీదేవి భగ్గుమంటున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకూడదని అధిష్టానం భావిస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు నేరుగా డొక్కాను స్ధానికంగా ఇన్ ఛార్జ్ గా కూడా నియమించడంతో ఉండవల్లి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే ఉండగా అదనపు ఇన్ ఛార్జ్ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తోంది. దీంతో శ్రీదేవి వర్సెస్ డొక్కా పోరుకు జగన్ తెరలేపినట్లు అర్ధమవుతోంది.

సుచరిత పాత్రపై శ్రీదేవి అసహనం?

సుచరిత పాత్రపై శ్రీదేవి అసహనం?

తాను ఎమ్మెల్యేగా ఉన్న తాడికొండలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను తీసుకొచ్చి అదనపు ఇన్ ఛార్జ్ గా నియమించడం, ఆయనకు మండలిలో విప్ గా ప్రోటోకాల్ పదవి కూడా ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి దీనంతటికీ మాజీ మంత్రి మేకతోటి సుచరితే కారణమని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి గుంటూరులోని సుచరిత ఇంటి ముందు ధర్నాకు కూడా దిగారు.

దీనిపై స్పందించిన సుచరిత అధిష్టానంతో మాట్లాడదామంటూ ఆమెకు నచ్చజెప్పి పంపారు. ఇవాళ అధిష్టానం తమ నిర్ణయం ప్రకటించకుంటే రాజీనామాకు సిద్ధమని తాడికొండలో శ్రీదేవి వర్గానికి చెందిన నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+