భూమా అఖిల ప్రియకు మరో షాక్ .. భర్త భార్గవ్‌రామ్, అతని సోదరుడు జగత్ విఖ్యత్ రెడ్డిలపై మరో కేసు !!
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కోర్టు విచారణ నుండి తప్పించుకోవడానికి వారిరువురు నకిలీ కోవిడ్ సర్టిఫికెట్లు కోర్టుకు సమర్పించినట్లు గుర్తించిన పోలీసులు వారి పై మరో కేసు నమోదు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన ఆసుపత్రి సిబ్బందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు గా తెలుస్తోంది.

కరోనా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని కేసు
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు షాక్ తగిలింది. ఆమె భర్త భార్గవ్ రామ్ పై, అలాగే అతని సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిలపై బోయినపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఈ నెల 3వ తేదీన కోర్టులో హాజరు కావాల్సి ఉండగా, కోర్టుకు హాజరు కాకుండా ఉండడానికి వారు కరోనా బారిన పడ్డట్టుగా ఈ నెల 1వ తేదీన సర్టిఫికెట్లు సమర్పించారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేదని వారిరువురు అందులో పేర్కొన్నారు.

కోర్టుకు హాజరు కాకుండా కరోనా ఫేక్ సర్టిఫికెట్లు
అయితే వారు కోర్టుకు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్లు తప్పని, అవి నకిలీవని అభియోగాలు వచ్చిన నేపధ్యంలో వాటిని పరిశీలించిన బోయినపల్లి పోలీసులు వారు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. విచారణ నుండి తప్పించుకోవడం కోసమే వారు నకిలీ సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించారని పోలీసులు తేల్చారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది వినయ్,రత్నాకర్, శ్రీదేవి లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

బోయినపల్లి కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న భూమా అఖిల కుటుంబం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి సోదరుడు కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి లతో పాటు 19 మంది పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో భూమా అఖిల ప్రియ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఒక భూ వివాదంలో పక్కా ప్లాన్ తో సినీఫక్కీలో బోయినపల్లి ప్రవీణ్ రావు ను, అతని సోదరుడిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కున్న భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ తో పాటుగా ఈ కేసులో అరెస్టయిన మరో 14 మంది నిందితులు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్నారు.
Recommended Video

వరుస కేసులతో సతమతమవుతున్న అఖిల ప్రియ
తాజాగా ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు కరోనా వచ్చినట్టు నకిలీ సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించి మరో కేసులో ఇరుక్కున్నారు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ అతని సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి.వరుసగా తగులుతున్న దెబ్బలతో, నమోదవుతున్న కేసులతో భూమా అఖిల ప్రియ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.












Click it and Unblock the Notifications