టీడీపీ, బీజేపీ లెక్కలు, నందిగం, బోరుగడ్డపై మరో హత్యాయత్నం కేసు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొందరు వైసీపీ నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను అమ్మనా బూతులు తిట్టిన నాయకులు ఇప్పుడు కేసుల భయంతో హడలిపోతున్నారు. ఇంకా కొందరు వైసీపీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద దాడులు చేయించారు.
తెలుగేదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే కొందరు నాయకులు అరెస్టు అయ్యారు.ఇంకా కొంత మంది వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకుని పోలీసుల ముందు విచారణకు హాజరు అవుతున్నారు. ఇవన్నీ టీడీపీ లెక్కలు. టీడీపీతో పెట్టుకున్నందుకు మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ తో పాటు కొందరు వైసీపీ నాయకులు జైల్లో ఉన్నారు.

ఇప్పుడు బీజేపీ నాయకుల వంతు వచ్చింది. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరపున ఉన్నఏకైక మంత్రి సత్యకుమార్ పై దాడి జరిగిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది ఇప్పటికే అరెస్టు అయిన నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు.
2023లో మూడు రాజధానుల శిభిరం దగ్గరకు వెళ్లిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వారికి సాంఘీభావం తెలిపారు ఆ సందర్బంలో అప్పటి సీఎం జగన్ తో పాటు వైసీపీని విమర్శించిన సత్యకుమార్ రాజధాని రైతులకు ధైర్యం చెప్పి ఆ శిభిరం నుంచి బయలుదేరారు. ఆ సందర్బంలో వైసీపీ కార్యకర్తలు సత్యకుమార్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఆ సందర్బంలోనే సత్యకుమార్ పై దాడి చేసిన 25 మంది మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉండటం, వైసీపీ నాయకుల మీద ఫిర్యాదులు చెయ్యడంతో పోలీసులు ఆ కేసులో ఏమీ చెయ్యలేకపోయారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉండటంతో పాత కేసులో విచారణ వేగవంతం అయ్యింది. బీజేపీ నాయకుడు, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ పై దాడి జరిగిన కేసులో ఏ1 నిందితుడు నందిగం సురేష్, ఏ2 నిందితుడు బోరుగడ్డ అనిల్ అని ఇద్దరి మీద పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇద్దరు నాయకులు బెయిల్ మీద బయటకు వస్తే వారిని సత్యకుమార్ పై హత్యాయత్నం జరిగిన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications