ఈ భార్య కూడా అదే పని చేసింది...ప్రియుడి కోసం భర్తని చంపేసింది
ప్రకాశం:తెలుగు రాష్ట్రాల్లో ప్రియుడి మోజులో భర్తను హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకొని 24 గంటలు కూడా గడవక ముందే మళ్లీ ప్రకాశం జిల్లాలో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది.
ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత అతడితో కలసి కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసి నిలదీయడంతో ఇక అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తరువాత ప్రియుడిని ఇంటికి రప్పించి అతడి సాయంతో భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ప్రకాశం జిల్లా దర్శిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

దర్శికి చెందిన పాణెం ఖాసీం బీకి స్థానికుడైన రమణయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి వ్యవహారం చుట్టుప్రక్కల వారి ద్వారా భర్తకు తెలియడంతో భర్త ఆమెని నిలదీశాడు. ప్రవర్తన మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. దీంతో భర్త కన్నకప్పడం కష్టమని భావించిన ఖాసింబీ ఏకంగా అతడిని అడ్డుతొలగించుకోవాలని భావించింది.
ఈ విషయం ప్రియుడు రమణయ్యతో చెప్పి అతడిని ఇంటికి రప్పించింది. ఆ తరువాత ప్రియుడి సాయంతో భర్త గొంతుకు తీగ బిగించి ఉపిరాడకుండా చేసి చంపేసింది. హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు తన భర్త ఉరివేసుకుని చనిపోయాడని మాయమాటలు చెప్పింది. అయితే ఘటన స్థలానికి చేరుకున్న బంధువులు గాయాలను చూసి భార్యే హత్య చేసి ఉంటుందని అనుమానించారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో హత్య విషయం బయట పడింది. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications