ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలేది నేడే: రెండో జాబితా విడుదల
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

ఇప్పుడు తాజాగా రెండో జాబితా సిద్ధమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జీల పేర్లతో కూడిన లిస్ట్ ఇది. ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు బలంగా ఉన్న జిల్లాలు ఇవి. ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బల పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో- వీటిని ప్రతిష్ఠాత్మంగాతీసుకుంది వైఎస్ఆర్సీపీ.
ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుల సంఖ్య అధికంగా ఉంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది చొప్పున వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈ రెండు జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఈ సంఖ్యా బలాన్ని మరింత పెంచుకునే దిశగా పార్టీ అగ్రనాయకత్వం కసరత్తు పూర్తి చేసింది.
రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, మార్గాని భరత్‌ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మండపేట నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications